Minister KTR answers on twitterities Questions లాక్ డౌన్ పోడగింపు విషయం క్యాబినెట్ భేటీ నిర్ణయం మేరకే: కేటీఆర్

Minister ktr answers on twitterities questions on covid initiatives

Ask KTR on Twitter Over Telangana Govts COVID Initiatives, When is the next Ask KTR session on twitter, KTR twitter session, KT rama rao on social media, latest news on KTR, Telangana news,,KTR, Ask KTR, twitter, Telangana, Hyderabad, KT Rama Rao, Ask KTR, Twiitter, Lockdown, Telangana cabinet, cabinet decision, KT Rama Rao, Vaccines Demand, Vaccine supply, Telangana

In view of increasing Covid-19 cases, Minister KTR appealed to the people to be cautious and cooperate with the government in containing the spread of the virus. Earlier he had acknowledged that there was a shortage of Covid vaccines, and despite an appeal made by Telangana Government to the Centre for the supply of additional vaccine doses, there was no response. The Minister had also recently recovered from COVID.

లాక్ డౌన్ పోడగింపు విషయం క్యాబినెట్ భేటీ నిర్ణయం మేరకే: కేటీఆర్

Posted: 05/13/2021 11:22 PM IST
Minister ktr answers on twitterities questions on covid initiatives

తెలంగాణ ఫట్టణాభివృది, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు ఇవాళ తనతో సామాజిక మాద్యమం ద్వారా ముచ్చటించారు. ట్విట్టరైట్లు తనను అడిగిన ప్రశ్నలపై ఆయన సౌమ్యంగా సానుకూల ధోరణిలో సమాధానాలు చెప్పారు.  కేటీఆర్ ట్విట్టర్ లో (Ask KTR)  ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా నెట్ జనులు పలు అంశాలపై మంత్రివర్యులను ప్రశ్నలు అడిగారు. కాగా ఓ నెటిజన్ లాక్ డౌన్ ను పోడగించనున్నారా అంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... లాక్ డౌన్ పొడిగింపుపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన బదులిచ్చారు.

క్యాబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలు అప్పటి పరిస్థితులను బట్టి ఉంటాయని చెప్పారు. ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం కానుందని వెల్లడించారు. ఇతర అంశాలపై చర్చిస్తూ... రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని.. గంటల సమయం కోద్ది ప్రజలు వాక్సీన్ కోసం బారులు తీరుతున్నారని ఓ నెట్ జన్ ప్రశ్నించారు. అయితే ఇందుకు డిమాండ్-సప్లై అంశమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వాక్సీన్ అధికంగా కేటాయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాని విన్నవించామని అయితే డిమాండ్ కు తగ్గట్టుగా సఫ్లై కాకపోవడంతోనే సమస్య ఉత్పన్నం అవుతోందని కేటార్ అన్నారు. ఇక 70 శాతం ప్రజానీకం వ్యాక్సిన్ పొందితే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు.

రాష్ట్రంలోని 2.9 కోట్ల వయోజనుల్లో 1.9 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్లు అమల్లో ఉన్నందున ఆ లెక్కన 3.8 కోట్ల డోసులు అవసరం అవుతాయని కేటీఆర్ వివరించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ, అమెరికా వ్యాక్సిన్లకు భారత్ లో అనుమతి లేదని, ఒకవేళ అనుమతి వస్తే తప్పకుండా వాటిని సేకరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర జనాభాకు తగినన్ని డోసులు వస్తే మాత్రం 45 రోజుల్లో తెలంగాణలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని, ఆ మేరకు సమర్థత, మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles