Telangana announces 10-day lockdown from May 12 తెలంగాణలో పదిరోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్..

Telangana imposes 10 day lockdown from may 12 amid covid 19 surge

coronavirus, covid-19, Telangana High Court, Lock down Telangana, telangana cabinet meet, corona second wave, KCR, corona tests, Telangana, Politics

The Telangana government onn Tuesday decided to imposea 10-day lockdown in the state starting May 12, to prevent further spread of coronavirus. According to an official release, the state cabinet decided to clamp a lockdown from 10 am on May 12 for 10 days. 'However, there would be relaxation for all the activities from 6 AM to 10 Am daily,' it said.

తెలంగాణలో పదిరోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్.. క్యాబినెట్ భేటీ నిర్ణయం

Posted: 05/11/2021 04:19 PM IST
Telangana imposes 10 day lockdown from may 12 amid covid 19 surge

తెలంగాణలో కరోనా ఉద్దృతి శరవేగంగా విస్తరిస్తూ రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తున్న నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర క్యాబినెట్.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రేపటి నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి అమల్లోకి రానున్న లాక్ డౌన్ పది రోజుల పాటు కోనసాగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశాన్ని కల్పించింది.

ఉదయం పది గంటల తరువాత మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు అములకానున్నాయి. దీంతో జనసంచారంపై కఠిన నియంత్రణలు అమలు కానున్నాయి, తెలంగాణలో కరోనా నబంధనలు కఠినంగా అమలుకావడం లేదని, మరీ ముఖ్యంగా పాతబస్తీలో అసలు కరోనా అప్రమత్తత కూడా లేదని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా నిబంధనలను మరింత కఠినంగా మారుస్తున్నారా.? లేక రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నారా.? అంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిన వేళ.. భేటీ అయిన క్యాబినెట్.. రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది.

నానాటికి భయానకంగా మారుతున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని రాష్ట్రంలోని అత్యధిక ప్రజల అభిప్రాయం. రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్న క్రమంలో లాక్ డౌన్ తో కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చునని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ హైకోర్టుతో సహా పలువురు లాక్ డౌన్ విధించడమే సరైన మార్గమని చెబుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజా కేబినెట్ భేటీలో లాక్‌డౌన్ వైపు మొగ్గు చూపారు. దీంతో కరోనా రెండవ దశ విజృంభనను కాసింత తగ్గించవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Lock down Telangana  corona second wave  Telangana  Politics  

Other Articles