Telangana HC warns Govt on corona tests తెలంగాణ సర్కారుకు హెచ్చరికలు జారీ చేసిన హైకోర్టు

Telangana hc warns govt says will issue contempt of court notices

coronavirus, covid-19, HC, Telangana High Court, Cheif Secretary, Somesh Kumar, Lock down press meet, contempt notices, corona tests, Telangana, Politics

The Telangana High Court warns the state government on reducing the tests of corona virus tests. Even questions on Government chief secretary Somesh kumar press meet in view of no lock down in the state, on the same day the court suggested to examine imposing of Lockdown in the state.

‘‘ధిక్కార నోటీసులిస్తాం..’’ తెలంగాణ సర్కారుకు హైకోర్టు హెచ్చరికలు..

Posted: 05/11/2021 03:51 PM IST
Telangana hc warns govt says will issue contempt of court notices

తెలంగాణలో కరోనా పరిస్థితులు నానాటికి భయానకంగా మారుతున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకొర్టు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో విరివిగా కరోనా నిర్థారణ పరీక్షలను జరపాలని తాము గతంలో ఇచ్చిన అదేశాలను ఎందుకు తప్పారని ప్రశ్నించింది. తమ అదేశాలను కావాలనే విస్మరించడంపై కోర్టు ధిక్కారణ నోటీసులు ఇమ్మంటారా అని నిలదీసింది.

పాతబస్తీలో కరోనా నిబంధనలు అమలు కావడం లేదని తక్షణం ఇక్కడి ప్రజలను కరోనా బారిన పడకుండా కాపాడేందుకు నిబంధనలను కఠినతరం చేస్తారా లేక లాక్‌డౌన్‌ విధిస్తారా? అని హైకోర్టు  ప్రశ్నించింది. దీంతో స్పందించిన అటర్నీ జనరల్.. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై కేబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న వివరాలు కూడా తెలియనున్నాయని, క్యాబినెట్ భేటీ అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు న్యాయస్థానంలో సమర్పిస్తామని ఏజీ అన్నారు. అయితే రాష్ట్రంలోనూ లాక్ డౌన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. సుమారు పది రోజుల పాటు లాక్ డౌన్ విదించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

కాగా ఆక్సిజన్ ప్రమాదాలపై సరైన వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలిపింది. పూర్తి వివరణ ఇవ్వాలంటూ మధ్యాహ్నం 2:30కు విచారణను వాయిదా వేసింది. ఏ రోజైతే తాము ఆదేశాలిచ్చామో.. అదే రోజు ప్రెస్ మీట్‌లు పెట్టి లాక్‌డౌన్ అవసరం లేదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఎలా చెబుతారని హైకోర్టు మండిపడింది. తాము లాక్‌డౌన్ గురించి పరిశీలించండి అన్నప్పుడు అలాంటిది అవరసం లేదు అని సీఎస్ ఎలా చెబుతారని ప్రశ్నించింది. రంజాన్ పండుగ అయ్యాక ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టాలనుకుంటుందా? అని హైకోర్టు నిలదీసింది. మధ్యాహ్నం వరకూ ఏజీ సమయం కోరగా.. తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2.30 వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Telangana High Court  Cheif Secretary  Somesh Kumar  Lock down  Telangana  Politics  

Other Articles