Bhuvanagiri MP writes letter to PM on corona deaths in Telangana కరోనా మరణాలపై ప్రధానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ..

Congress mp venkat reddy writes letter to pm on corona deaths in telangana

Congress MP letter to PM Modi, Komati Reddy Venkat Reddy letter to PM Modi, Bhuvanagiri MP letter to PM Modi, Komati reddy venkat reddy letter to modi on corona deaths, coronavirus, komatireddy venkat reddy, Journalists, corona deaths, front line warriors, Bhuvanagiri MP, Congress, PM Modi, Telangana

Congress Member of Parliament Komati reddy Venkat Reddy representing from Bhuvanagiri wrote a Prime Minisiter Narendra Modi alleging that the deaths due to coronavirus are many in hundreds but the state government is showing only in tens.

కరోనా మరణాలపై ప్రధానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ..

Posted: 05/11/2021 01:59 PM IST
Congress mp venkat reddy writes letter to pm on corona deaths in telangana

తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మరణాల విషయంలో తప్పుడు లెక్కలను ప్రకటిస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు అసుపత్రుల్లోనే వందలాది మంది మరణిస్తున్నా.. ప్రభుత్వం మరణాల విషయంలో తప్పుడు లెక్కలను విడుదల చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన రాష్ట్రంలో కొవిడ్ కారణంగా ప్రతీ రోజు వందలాది మంది చనిపోతున్నారని, అయినా ప్రభుత్వం తప్పడు నివేదికలను ఇస్తూ.. వాస్తవ మరణాలను దాచిపెడుతోందని ఆయన అరోపించారు. 

ఈ మేరకు కరోనా మరణాల విషయంలో నిజానిజాలను వెలికితీయాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని, కాబట్టి మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని మోదీకి రాసిన ఆ లేఖలో కోమటిరెడ్డి కోరారు. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుయ్యబట్టారు. ఇక కరోనా బారిన పడి జర్నలిస్టులు కూడా అసువులు బాస్తుండటంపై ఆయన అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణం జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

సిద్దిపేట జిల్లా సాక్షి టీవీ రిపోర్టర్ చెలుకుల వెంకట్ రెడ్డి కరోనాతో మృతి చెందడం తనకు బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన వెంకట్ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వార్తల సంగ్రహనంలో రాజీ పడకుండా పనిచేసినందుకు జర్నలిస్టులు కూడా కరోనా కాటుకు బలవుతున్నారని.. తక్షణం ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించిన ఆదుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయించాలని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles