SBI customers can now change your SBI branch online ఎష్బీఐ గుడ్ న్యూస్: ఆన్ లైన్ లోనే కోరుకున్న బ్రాంచీకి అకౌంట్ ట్రాన్స్ ఫర్..

Good news to sbi customers now account holders can change account online

State Bank of India, SBI, SBI news, SBI latest news, SBI online transactions, SBI online branch change, SBI branch change online, SBI branch change online news, SBI latest updates, online transactions SBI, online frauds SBI, digital fraud SBI, companies, personal finance, Savings account

India's largest lender State Bank of India (SBI) allows customers to transfer their SBI savings account from one branch to another branch online from the comfort of their home. Customers wanting to transfer their account need not physically visit any branch to get their SBI savings accounts transferred to another branch.

ఎష్బీఐ గుడ్ న్యూస్: ఆన్ లైన్ లోనే కోరుకున్న బ్రాంచీకి అకౌంట్ ట్రాన్స్ ఫర్..

Posted: 05/10/2021 11:58 PM IST
Good news to sbi customers now account holders can change account online

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తన ఖాతాదారులకు శుభవార్త తెలియజేసింది. ఇన్నాళ్లు తమ శాఖను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునేందుకు ఖాతాకు సంబంధించిన డాక్యుమెంట్లతో రెండు ప్రాంతాల్లోని శాఖలకు తిరగాల్సి వచ్చేంది. అయితే ఇకపై బ్రాంచిని మార్చుకోవాలనుకంటే బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. బ్యాంకు వెబ్ సైట్ లోకి వెళ్లి సంబంధిత వివరాలు పూర్తి చేసిన తరువాత వారం రోజుల్లో మీ ఖాతా మీరు కోరుకున్న శాఖకు బదిలీ అవుతుంది. కొన్ని రోజుల్లోనే మీ ఖాతా కావాల్సిన బ్రాంచికి బదిలీ అయిపోతుంది. కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఇంట్లోనే ఉండి బ్యాంకింగ్‌ సేవల్ని వినియోగించుకునేందుకు ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ onlinesbi.comకి లాగిన్ కావాలి

పర్సనల్‌ బ్యాంకింగ్ పై క్లిక్‌ చేయండి

యూజర్‌ నేమ్‌, పాస్వర్డ్‌పై క్లిక్ చేయండి

ఈ-సర్వీస్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి

ట్రాన్స్‌ఫర్‌ సేవింగ్స్ అకౌంట్‌ ఆప్షన్‌ని ఎంచుకోండి

యువర్‌ అకౌంట్‌ టు బి ట్రాన్స్‌ఫర్డ్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోండి

బదిలీ చేసుకోవాల్సిన ఖాతాను సెలెక్ట్‌ చేసుకోండి

ఖాతాను బదిలీ చేసుకోవాలనుకుంటున్న బ్రాంచి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఎంటర్‌ చేయండి

అన్ని వివరాలు ఒకసారి చెక్‌ చేసుకొని కన్ఫర్మ్‌ బటన్‌ని నొక్కండి

మీ రిజిస్టర్‌ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి కన్ఫర్మ్‌ నొక్కండి

కొన్ని రోజుల్లోనే మీ ఖాతా బదిలీ అయిపోతుంది

ఎస్బీఐకి చెందిన యోనో యాప్‌, యోనో లైట్‌ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles