Businessman offers Rs 50 Lakh for Ventilator bed హైదరాబాదులో వెంటిలేటర్ బెడ్ కోసం వ్యాపారవేత్త ఆఫర్

Businessman offers rs 50 lakh for ventilator bed for his son

hyderabadi businessman, businessman, Rs 50 Lakh offer, Ventilator bed, corporate hospitals, covid-19, coronavirus, pandemic, hyderabad, Telangana

Hyderabadi Businessman offers Rs 50 Lakh for Ventilator bed to corporate Hospitals, whose son is suffering from covid-19 and is critical. Even than he had to wait for 24 hours for ventilator bed, this shows the pandemic situation in Hyderabad.

హైదరాబాదులో వెంటిలేటర్ బెడ్ కోసం వ్యాపారవేత్త ఆఫర్

Posted: 05/04/2021 06:17 PM IST
Businessman offers rs 50 lakh for ventilator bed for his son

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభన అంతకంతకూ పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా లభించని స్థితి నెలకొంది. అయినా ప్రజల్లో మాత్రం ఎలాంటి అప్రమత్తత లేదెు. మాస్కులు వేసుకోకుండానే ఇప్పటికీ అనేక మంది రోడ్డపైకి వస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా కరోనా విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినవస్తున్నాయి.  ఇప్పటికే అసుపత్రుల్లో బెడ్లు లభించక అనేక మంది అసుపత్రుల భయటే పడిగాపులు కాస్తున్నారు. అసుపత్రుల్లో చేరిన వారికి ఆక్సిజన్, ఔషదాలు కూడా లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

ఇక సత్వహాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి వెంటిలేటర్ చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో అందుబాటులో ఉన్న ఒక్కో వెంటిలేటర్ కోసం పోటీ బాగా పెరిగింది. ఒక్కో వెంటిలేటర్ కోసం దాదాపు 15 నుంచి 20 మంది పోటీపడుతున్నారు. ఇక వెంటిలేటర్ సాయం తీసుకున్న రోగులు ఒక్కక్కరూ పది నుంచి పక్షం రోజుల పాటు దాని సాయంతోనే సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఒక్కో వెంటిలేటర్ కొత్త రోగులకు అందుబాటులోకి రావడానికి పది రోజుల నుంచి పక్షం రోజుల సమయం పడుతోంది. దీంతో వెంటిలేటర్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని ఓ బడా వ్యాపారి కుమారుడికి కరోనా సోకింది. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో వెంటిలేటర్ అత్యవసరమైంది. అందుకోసం అతను కార్పోరేట్ ఆసుపత్రులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. తన కొడుకు ప్రాణాలు కాపాడితే రూ. 50 లక్షలు ఇస్తానని.. తన డబ్బుకు బిల్లు కూడా అవసరం లేదని చెప్పాడు. ఇక ఇంత పెద్ద మొత్తం ఎక్కువని భావిస్తే, మిగిలే డబ్బులతో పేదలకు కరోనా వైద్యం చేయాలని సూచించాడు. అయితే ఇంతటి ఆఫర్ ఇచ్చినా సదరు వ్యాపారి తనయుడికి వెంటిలేటర్ ఏకంగా 24 గంటల వ్యవధి తరువాతే లభించింది. నగరంలో ప్రస్తుతం నెలకోన్న పరస్థితిని ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ ఘటనను ప్రస్తావించాల్సి వస్తోంది. హైదరాబాద్ లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్ లకు ఎండ డిమాండ్ ఉందన్న విషయం.

ఇక ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారికి తాత్కాలికంగా వెంటిలేటర్ బెడ్లకు బదులుగా ఆక్సిజన్ బెడ్లు ఇస్తామని, రెండు మూడు రోజుల తరువాత ఖాళీ అయితే, వెంటిలేటర్ బెడ్లు ఇస్తామని, ఈలోగా ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు ఖరాఖండీగా చెబుతున్నాయి. వెంటిలేటర్ల కోసం ఇంతగా డిమాండ్ పెరగడం ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని వైద్యులే చెబుతుండటం గమనార్హం. ఇక లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలతో ఉన్న వారు వైద్యుల సలహాలను తీసుకోకుండానే ఇంట్లో చికిత్సలు తీసుకుంటూ హోమ్ ఐసొలేషన్ కు పరిమితం అవుతున్నారని, వారిలో పరిస్థితి విషమించడంతోనే వెంటిలేటర్ బెడ్లకు డిమాండ్ పెరుగుతోందని వైద్యులు అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎంతగా విషమించిందంటే, ఎవరైనా కోలుకుంటేనో, లేదంటే చనిపోతేనో మాత్రమే వెంటిలేటర్ బెడ్ ఖాళీ అవుతోంది. ఈ చికిత్సలో కనీసం రోజుకు 20 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. బాధితుడు తనంతట తానుగా ఊపిరి పీల్చుకునే వరకూ చికిత్స అవసరం ఉంటుంది. ఇదే సమయంలో నాలుగు ఆక్సిజన్ బెడ్లపై ఉన్న రోగులకు ఒక నర్స్ అవసరం కాగా, వెంటిలేటర్ బెడ్ పై ఉన్న రోగి సహాయార్థం ఒక నర్సును నియమించడం తప్పనిసరని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి కరోనా బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు, ప్రభుత్వం కోరుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles