HC comments over survey on Etala assigned land ఈటెల హేచరీస్ లో సర్వే రాత్రికి రాత్రే ఎలా పూర్తైంది.?: హైకోర్టు

Hc makes serious comments over report on land grabbing charges against etala

CM KCR, Etala Rajender, Achampeta, Hakimpet, Masaipeta Mandal, Medak, Vigilence DG, Purnachander Rao, Dharma Reddy, Nagesh, Harish Rao, MP Prabhakar Reddy, Narsapur MLA Madan Reddy, chief secretary Somesh Kumar, Medak collector Harish, district officials, Crime

During the hearing of arguments over petition filed by Jamuna on behalf of Jamuna Hatcheries, the Telangana High Court on Tuesday made serious comments on Medak Collector for submitting a report to the Chief Secretary without serving notices.

నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయవచ్చా: ఈటెల కేసులో హైకోర్టు ప్రశ్న

Posted: 05/04/2021 05:15 PM IST
Hc makes serious comments over report on land grabbing charges against etala

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూములను మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కబ్జా చేశారన్న అరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అరోపణలపై అధికారుల విచారణ చేసి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వెనువెంటనే మంత్రి పదవిని తన కిందకు తీసుకున్న తరువాత ఈటెలను పదవి నుంచి ఉద్వాసన కూడా పలికిన పరిణామాలు కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టప్రకారం తన భూముల్లో అసైన్డ్ భూములు ఉంటే దానిని విచారించాల్సిన పద్దతి ఇది కాదని, తనతో పాటు తన ఇరుగుపోరుగు రైతులను కూడా పిలచి పంచుల సమక్షంలో జిల్లా ఈడీ అధికారులు సర్వే చేస్తారని.. రెండు రోజుల క్రితం జ‌రిపిన‌ భూముల స‌ర్వే పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌లేద‌ని ఈట‌ల అంటున్నారు.

భారీ పోలీసు బలగాల మోహరింపు మధ్య అధికారులు విచారణ జరపడమేమిటని ఈటెల ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కుటుంబం రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పేర్కొంటూ ఈటల రాజేంద‌ర్ భార్య‌, కుమారుడు, జమునా హేచరీస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మెద‌క్ క‌లెక్ట‌ర్ ఇచ్చిన నివేదిక త‌ప్పుల త‌డ‌క‌గా ఉందని చెప్పారు. త‌మ‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వ‌కుండా హేచ‌రీస్‌లోకి వెళ్లి విచార‌ణ చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. అచ్చంపేట‌లోని తమకు సంబంధించిన భూముల్లో అక్ర‌మంగా ప్ర‌వేశించి, సర్వే చేసి బోర్డులను పెట్టారని కోర్టుకు తెలిపారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని హైకోర్టును కోరారు.

ఈటెల కుటుంబసభ్యులు దాఖలు చేసిన అత్యవసర పిటీషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించగా, హైకోర్టు పలు ప్రశ్నలను ఆయనకు సంధించింది. అరోపణలు వచ్చినా.. రాకున్నా.. సర్వే చేస్తున్నప్పుడు సదరు భూ యజమానులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయిందని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. అంతకుముందు ఈటెల తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వలేదని, తమ భూముల్లోకి అధికారులు అక్రమంగా చోరబడ్డారని, కలెక్టర్ నివేదికను కూడా ఇవ్వలేదని చెప్పారు.

ఈటెలపై తీవ్రమైన అరోపణలు రావడంతోనే విచారణ జరుపుతున్నామని అడ్వకేట్ జనరల్ సమాధానమివ్వగా న్యాయస్థానం ప్రశ్నలను సంధించింది. ఫిర్యాదు వస్తే ఎవరి  ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని ప్ర‌శ్నించింది. అధికారులు రూపొందించిన నివేదికపై పలు అభ్యంత‌రాలు తెలిపింది. అయితే, ఈట‌ల భూముల‌పై ప్రాథ‌మిక విచార‌ణ మాత్ర‌మే చేసిన‌ట్లు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తెలిపారు. ఈ విష‌యంపై త‌దుప‌రి చ‌ర్య‌లు చ‌ట్ట ప్ర‌కార‌మే ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ నివేదిక‌లో తెలిపార‌ని అన్నారు. పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Etala Rajender  Achampeta  Hakimpet  Masaipeta Mandal  Medak  Vigilence DG  Purnachander Rao  Telangana  crime  

Other Articles