CM Orders Probe into Land Grabbing Allegations Against Etela ఈటెల భూమిలో అసైన్డ్ భూమి ఉంది: కలెక్టర్

Telangana cm orders probe into land grabbing allegations against cabinet minister

CM KCR, Etala Rajender, Achampeta, Hakimpet, Masaipeta Mandal, Medak, Vigilence DG, Purnachander Rao, Dharma Reddy, Nagesh, Harish Rao, MP Prabhakar Reddy, Narsapur MLA Madan Reddy, chief secretary Somesh Kumar, Medak collector Harish. district officials, Crime

Telangana chief minister K Chandrasekhar Rao has asked the vigilance department to investigate the land-grabbing allegations against the cabinet minister for health, Etela Rajender. The chief minister asked DG Purnachander Rao to submit a preliminary report soon and another report after a detailed enquiry.

ఈటెల హేచరీస్ లో అసైన్డ్ భూమి: ప్రాథమిక విచారణ

Posted: 05/01/2021 01:36 PM IST
Telangana cm orders probe into land grabbing allegations against cabinet minister

తెలంగాణ వైద్యఅరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహా ఆయన అనుచరులైన పలువురు మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూములు కబ్జా చేశారన్న అరోపణలపై ఇవాళ విజిలెన్స్ డిజి పూర్ణచంద్రర్ రావు నేతృత్వంలో విజిలెన్స్ అధికారులు, అవినితీ నిరోధక శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రిపై ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. తమకు 1994లో అప్పటి ప్రభుత్వం భూమిలేని తమకు భూమిని అసైన్ చేసిందని.. ఆ భూమిని తాజాగా ఈటెల అనుచరులు కబ్జా చేశారని వారు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా సీఎస్ సోమేష్ కుమార్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ కూడా లేఖలు రాశారు.

ఈ లేఖలపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆరోప‌ణ‌ల‌పై దర్యాప్తు జరిపి వేగంగా ఒక నివేదికను సమర్పించాలని ఆయన విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావును అదేశించారు. దీంతో పాటు సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌ ద్వారా తెప్పించి రిపోర్టు అందజేయాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌ కుమార్ ను ఆదేశించారు. వందల కోట్ల రూపాయ‌ల‌ విలువైన అసైన్డ్ భూములను తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్ కాజేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో దానిపై విచార‌ణ‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. విజిలెన్స్ ఎస్సీ మనోహర్, తూప్రాన్ అర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూమునులను సర్వే చేస్తూ విచారణను కోనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అచ్చంపేటకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

కాగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విజిలెన్స్ అధికారులు అందించిన విచారణ నివేదికను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూసాపేట తహసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆనంతరం ఈటెలకు చెందిన అచ్చంపేట భూముల్లో అసైన్డ్ భూములు వున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు తమ ప్రాథమిక విచారణలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేశారు. తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ నేతృత్వంలోని ఆరు  ప్రత్యేక బృందాలు ఈ భూమిలో సర్వే నిర్వహించాయని కలెక్టర్ తెలిపారు.

మంత్రి ఈటెల రాజేందర్ కు చెందిన హేచరీస్ డిజిటల్ సర్వే కోనసాగుతోందని, దీంతో పాటు హేచరీస్ పక్కనవున్న అసైన్డ్ భూముల్లోనూ అధికారులు డిజిటల్ సర్వే కోనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై అటు ఈటెల అనుచరులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. శామీర్ పేట‌లోని ఈట‌ల రాజేంద‌ర్ ఇంటి వ‌ద్ద‌కు అభిమానులు, కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకుంటున్నారు. ఈట‌ల‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఉద్యమపార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఈటెలను ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉండకుండా తప్పించేందుకు వ్యూహాత్మకంగా ఈటెల హేచరీస్ అంశాన్ని పార్టీ పెద్దలు తెరపైకి తీసుకువచ్చారని ఆయన అనుచరులు అరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Etala Rajender  Achampeta  Hakimpet  Masaipeta Mandal  Medak  Vigilence DG  Purnachander Rao  Telangana  crime  

Other Articles