Vijaya Reddy Moula Ali incident remembers PJR అనుచరుడి స్థలం కోసం మౌలాలీకి విజయారెడ్డి..

Khairatabad corporator vijaya reddy stands her follower demolishes shed

khairatabad corporator, vijaya reddy, p. Janardhan Reddy, party activist, house site, encroachment, demolish, asbestors, vijaya reddy hulchul, moula ali, Hyderabad, Telangana, Politics

khairatabad corporator vijaya reddy stands by the side of her party activist and assures him of his land from being encroached by others, she says her follower is the whole and sole owner of the land since 1960s. she demolishes the asbestors and creates hulchul in moula ali hyderabad.

అనుచరుడి స్థలం కోసం మౌలాలీకి విజయారెడ్డి.. పీజేఆర్ గుర్తుచేసిందని కామెంట్లు..

Posted: 03/30/2021 12:50 PM IST
Khairatabad corporator vijaya reddy stands her follower demolishes shed

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అన అనుచరుడి కోసం కదిలారు. నేను ఫోన్ చేస్తాను నువ్వు వెళ్లి అక్కడి పోలీసులను లేదా రెవెన్యూ అధికారులను కలిసి నాకు ఫోన్ చేయిస్తే నేను వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పే నాయకులు ఎందరో మన చుట్టూ వున్నారు. ఇక సివిల్ మ్యాటర్ లో వేలు పెట్టకూడదు అని తప్పించుకునే నాయకులు కూడా వున్నారు. ఇప్పుడిప్పుడే ఓట్ల పండగ అయిపోయింది.. ఇక అనుచరులతో మనకు మళ్లి ఎన్నికలప్పుడే పని కదా.. అందాక చూద్దాం.. చేద్దాం అని చెబితే చాలు అనుకునే నాయకులు కూడా వున్నారు.

కానీ అనుచరుడికి కష్టం వస్తే తన సోంత కారులో మౌలాలీకి చేరుకుని అక్కడ హల్ చల్ చేసిన నాయకురాలు విజయా రెడ్డి. కేరాప్ పీజేర్ డాటర్. అదేనండీ పీ జనార్థన్ రెడ్డి తనయ విజయారెడ్డి. తన అనుచరుడి ఇంటిస్థలం కబ్జా అవుతుండగా దానిని అపి.. ప్రత్యర్థి వర్గాలు వేసిన రేకుట షెడ్డును తాను స్వయంగా అక్కడే వుండి నెలమట్టం చేయించారు. తన అనుచరుడికి వచ్చిన కష్టం తనకు వచ్చిన కష్టంగా భావించిన అమె.. 1974 నుంచి సదరు భూమికి యజమానులుగా వుంటూ వస్తున్న అనుచరుడి కుటంబానికి కాకుండా ఇతరులకు ఎలా చెందుతుందని ఆమె మౌలాలీలో హంగామా చేశారు.

తన అనుచరుడికి సంబంధించిన మౌలాలిలో ఓ స్థల వివాదంలో ఆమె జోక్యం చేసుకున్నారు. తన అనుచరుడికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్డును తొలగించారు. ప్రహరీని కూల్చివేయించారు. స్వయంగా ఆమె కూడా కొన్నింటిని తొలగించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తమ కార్యకర్త కుటుంబం ఆ స్థలాన్ని 1974లో కొన్నదని, ఇటీవల కొందరు వ్యక్తులు ఈ భూమి విషయంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని షెడ్డు వేసి దౌర్జన్యం చేస్తున్నారని విజయారెడ్డి పేర్కొన్నారు.

దీంతో తన అనుచరుడికి అండగా ఉండేందుకే అక్కడికి వెళ్లినట్టు తెలిపిన విజయారెడ్డిని.. అమె అనుచరులతో పాటు పి. జనార్థన్ రెడ్డి అభిమానులు కొనియాడుతున్నారు. అనుచరుడి కోసం స్వయంగా కదిలివచ్చిన నాయకురాలు విజయా రెడ్డి అంటూ సోషల్ మీడియాలో అమె వీడియోలను షేర్ చేసుకుంటున్నారు. పేదల కోసం తన జీవిత కాలం పాటు పోరాడిన పీజేఆర్.. వారి అభ్యున్నతే తన ఉచ్వాసనిశ్వాసలుగా బతికిన పీజేఆర్ నాయకత్వాన్ని ఆయన తనయ మరోమారు ఈ ఘటనతో గుర్తుచేసిందని ప్రశంసిస్తున్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న పెద్దల పాలిట సింహస్వప్నంగా నిలిచిన పీజేఆర్.. సిద్దాంతాల్లోనే అమె నడుస్తున్నారని కీర్తిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khairatabad corporator  vijaya reddy  P. Janardhan Reddy  encroachment  moula ali  Hyderabad  

Other Articles