ప్రచండ భానుడి ఉగ్రరూపానికి నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో ఏ ఏడుకాయేడు పెరుగుతూ పోతున్నాయి. దీంతో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు ప్రస్తుతం ఉగ్రరూపం దాలుస్తూ నగరవాసులపై ఉరుముతున్నాడు. నగరంలో మార్చి మాసాంతంలోనే ఏకంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయంటే ఇక రానురాను పరిస్థితులు ఎంత తీవ్రంగా వుండబోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ మాత్రమే కాకుండా ఏకంగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం ఈ సీజన్ లోనే అత్యధికంగా ఉండబోతుందన్న దానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇటు హైదరాబాద్ లోనూ క్రితంరోజున భానుడు భగభగలు సాధారణస్థాయికి మించి వున్నాయి. ఖైరతాబాద్ లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-25.9 డిగ్రీలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండల తీవ్రతకు నగరవాసులు బెంబేలెత్తున్నారు. పొట్టకూటి కోసం అనేక మంది రోజంతా ఎండలో తిరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో అక్కడక్కడా చలివేంద్రాలే తప్ప.. ఎండ తీవ్రత నేపథ్యంలో సల్ల (మజ్జిగ) అంబలి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుండేదన్న నగరవాసలు భావిస్తున్నారు. ప్రభుత్వం చేయని పక్షంలో కనీసం జీహెచ్ఎంసీ అయినా ఈ మేరకు చోరవ తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వాహనదారులు, ప్రయాణికులు, వృద్ధులు, పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
(And get your daily news straight to your inbox)
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more
May 16 | సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ... Read more
May 16 | ఈశాన్య రాష్ట్రం అసోంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. వర్షంతో పాటు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజాజీవనం స్థంభించింది. వర్షం, వరదల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, అపార ఆస్తినష్టం వాటి్ల్లినట్లు... Read more
May 16 | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో పడిన రక్తపు మరకలు గడ్డకట్టకముందే.. మరో రెండు ప్రాంతాల్లో కాల్పుల మోత మార్మోగాయి. బఫెలో కాల్పుల ఘటన... Read more
May 16 | పద్నాలుగేళ్ల మైనర్ బాలుడిని ముద్దు పెట్టుకోవడంతో పాటు అతని రహస్యబాగాలను తాకడం అసహజ లైంగిక చర్య (అన్నాచురల్ సెక్సువల్ అసల్ట్) కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలుడిని ముద్దు... Read more