Gangster escapes from police custody outside GTB Hospital సినీపక్కీలో తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..

Wanted criminal escapes from police custody outside gtb hospital

news Delhi, shootout, police, OPD, gtb hospital encounter, gtb hospital, Fajja, Gogi, Delhi gangsters, Delhi Firing, Delhi Police, Delhi GTB Hospital, GTB hospital Delhi, Kuldeep Maan Fajja, Jitender Maan gogi, Delhi, Crime

High voltage drama unfolded at the GTB Hospital when half a dozen armed assailants came to rescue one of their associates– Kuldeep Maan alias Fajja– a close associate of dreaded gangster Jitender Maan alias Gogi, from police custody. The assailants also fired at the police personnel of the 3rd battalion.

సినీపక్కీలో తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎన్ కౌంటర్..

Posted: 03/25/2021 05:19 PM IST
Wanted criminal escapes from police custody outside gtb hospital

దేశ రాజధాని ఢిల్లీలో సినీపక్కిలో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసుల చెర నుంచి తప్పించుకున్నారు. పోలీసులకు చిక్కిన ముఠా సభ్యుడ్ని విడిపించేందుకు సదరు గ్యాంగ్ స్టర్లు దాడులకు పాల్పడడం అనేక పాత చిత్రాల్లో వచ్చిందే. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం అలాంటివి చిత్రాల్లో కనబడటం లేదు. అందుకనే నిజంగా చేసి చూపుదామని భావించారో ఏమో తెలియదు కానీ.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. కుల్ దీప్ మాన్ అలియాస్ ఫజ్జా ఓ కరడగట్టిన నేరస్తుడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జతిందర్ మాన్ అలియాస్ గోగి ముఠాలో కీలక సభ్యుడు.

అయితే గతేడాది జితేందర్ మాన్ అలియాస్ గోగిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఢిల్లీలోని గురుగ్రామ్, సెక్టార్ 82 లోని మాప్స్ కో కాసబెల్లా అపార్ మెంట్స్ లో అరెస్టు చేశారు.. అతనితో పాటు అతని ముఠాసభ్యులైన మరో ముగ్గుర్ని కూడా అరెస్టు చేశారు. వీరిలో కులదీప్ మాన్ కూడా వున్నాడు. వీరందరూ పలు విధాలుగా జైలు నుంచి బయటకు వచ్చాయి. కాగా ఇప్పటికీ జైలులో వుంటూ అరోగ్యం క్షీణించిన కుల్ దీప్ మాన్ అలియాప్ ఫజ్జాను పోలీసుల నుంచి తప్పించాలని ప్లాన్ చేశారు. అనారోగ్యం బారినపడడంతో పోలీసులు ఎస్కార్టు సాయంలో కుల్ దీప్ ను ఢిల్లీ జీటీబీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న గోగి ముఠా సభ్యలు ఓ స్కారియో వాహనంతో పాటు మరో బైక్ పై వచ్చి.. పోలీసుల కంటే ముందుగానే ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రి వద్దకు చేరుకుని వాహనాల్లో కాపు కాశారు. కుల్ దీప్ ను తీసుకువస్తున్న పోలీసు వాహనం ఆసుపత్రికి వద్దకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో షాక్ కు గురైన పోలీసులు.. వెంటనే తేరుకుని ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక గ్యాంగ్ స్టర్ మరణించాడు. మరో గ్యాంగ్ స్టర్ గాయపడ్డి పోలీసులకు చిక్కాడు. అయితే, ఈ ఘటనలో జతిందర్ గ్యాంగ్ అనుకున్నది సాధించింది. పోలీసుకస్టడీలో ఉన్న కుల్దీప్ ను విడిపించుకుని అక్కడ్నించి పరారైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles