Karnataka minister throws 'monogamy challenge' ‘‘ఎమ్మెల్యేందరూ ఏకపత్రీవత్రులేగా.. పరీక్షలకు సిద్దమా.?’’

Karnataka minister dares mlas to take monogamy test own up to affairs

K Sudhakar monogamy test, Health Minister controversy , Karnataka MLAs monogamy test, karnataka ministers extra-marital affairs, former CM siddaramaiah, Karnataka CLP Leader DK shivakumar, JDS Leader HD kumaraswamy, K Sudhakar, Health Minister, Karnataka Assembly, extra-marital affairs, siddaramaiah, shivakumar, kumaraswamy, Karnataka, Crime

Karnataka Health Minister K Sudhakar's statement, calling for an investigation into the personal life of all 225 members of the state assembly to find out how many of them have had illicit or extra-marital relationships, created a flutter in political circles.

ఏకపత్రీవత్రులైతే నిరూపనకు సిద్దమా.? కర్ణాటక మంత్రి సవాల్.!

Posted: 03/25/2021 03:18 PM IST
Karnataka minister dares mlas to take monogamy test own up to affairs

వివాహేతర’ సంబంధాలపై కర్ణాటక అసెంబ్లీలో ఆరుగురు మంత్రులను పదవుల నుంచి బర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యేలంతా ఏకపత్నీవ్రతులమని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ‘‘అసెంబ్లీలోని 225 మంది ఎమ్మెల్యేలు.. తమకేం వివాహేతర సంబంధాలు లేవని నిరూపించుకోవాలి. అందుకు ఏకపత్నీవ్రతులమన్న పరీక్షను ఎదుర్కోవాలి’’ అని ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాల నుంచే కాకుండా స్వపక్షాల నుంచి కూడా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గిన ఆయన తాను చేసిన మాటలను వెనక్కు తీసుకున్నారు,

ప్రభుత్వఉద్యోగం కల్పిస్తామన్న ఆశతో.. తనను అన్ని రకాలుగా వాడుకున్న మంత్రి.. తనకు ఉధ్యోగం పెట్టించకపోగా ఇప్పడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని బాధిత యవతి అభ్యర్థిస్తూ.. ఓ సామాజిక కార్యకర్తకు సీడిని ఇవ్వగా అతను మీడియాకు రిలీజ్ చేయడంతో మంత్రి రమేష్ జార్కిహోళి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తమ బాగోతాలు కూడా ఎక్కడ బయటకు వస్తాయోనని అందోళనతో మరో ఆరుగురు మంత్రులు న్యాయస్థానం నుంచి తమ సీడీలను బహిర్గతం చేయకూడదంటూ సిడీ గాగ్ అర్డన్ ను తెచ్చుకున్నారు. దీంతో వీరిు కూడా రాజీనామాలు చేయాల్సిందేనని విపక్షాలు గత వారం రోజులుగా కర్ణాటక అసెంబ్లీలో డిమాండ్ చేస్తున్నాయి.

ఈ తరువాత ఓ యువతిని అవసరానికి వాడుకుని తరువాత తనతో సహా ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలంటూ ఆరు రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుధాకర్.. ఏకపత్నీవ్రత పరీక్షను పెడితే పతివ్రతల్లా మాట్లాడుతున్న అందరి బాగోతాలూ బయటపడతాయని వ్యాఖ్యానించారు. ‘‘మర్యాద రామన్నల్లా.. శ్రీరామచంద్రుల్లా మాట్లాడుతున్న వారందరికీ ఇదే నా సవాల్. 225 మంది ఎమ్మెల్యేల ప్రైవేట్ లైఫ్ మీద దర్యాప్తు చేయిద్దాం. ఎవరికి అక్రమ సంబంధాలున్నాయో, ఎవరెవరితో సంబంధాలున్నాయో తేలుద్దాం. ఇది నీతికి, నిజాయతీకి సంబంధించిన విషయం’’ అని అన్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మునియప్పల పేర్లను తీసుకున్న ఆయన వీరందరితో పాటు అసెంబ్లీలో వున్న మొత్తం 225 మంది శాసనసభ్యులందరూ ఏకపత్నీవత్రుల పరీక్షలకు సిద్దమేనా.. వారి వ్యక్తిగత జీవితతంపై విచారణకు అందరూ సహకరిస్తారా.? అని ఆయన ప్రశ్నించారు. ‘‘అందరూ సత్యహరిశ్చంద్రులే కదా.. ఏకపత్నీవ్రతులే కదా.. వారి ప్రైవేట్ లైఫేంటో తేలుద్దాం మరి’’ అని అన్నారు.

అయితే, ఆయన వ్యాఖ్యలపై కల్పించుకున్న స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి.. అసెంబ్లీ ఎవరూ ఎవరి గురించి అలాంటి మాటలు మాట్లాడడం తగదని అన్నారు. సుధాకర్ వ్యాఖ్యలు శాసనసభ మర్యాదను భంగపర్చేలా వున్నాయని, ప్రజా జీవితంలో వుంటున్న నేతలు.. ప్రజలు చూస్తున్నారన్న కనీస ఇంకితం కూడా లేకుండా చౌకబారు మాటలను ఉచ్చరించడం ఎంతవరకు సమంజసమని.. ఇది రాష్ట్ర ఎమ్మెల్యేల గౌరవానికే తీరని భంగం కలిగించేవని సిద్దరామయ్య విమర్శించారు. సుధాకర్ వ్యాఖ్యలను ఒక్కమాటలో ఖండించారు డీకే శివకుమార్. తనకు ఒక్కతే భార్య అని ఒక్కటే కుటుంబమని ఆయన తేల్చిచెప్పారు.

ఇక సుధాకర్ లాంటి నీచమైన వ్యాఖ్యలు తాను కానీ, తన తండ్రి కానీ ఎప్పుడూ విపక్షసభ్యులను టార్గెట్ చేసి అనలేదని గుర్తుచేశారు. అయితే న్యాయస్థానానికి వెళ్లి సీడీలను బయటపెట్ట రాదంటూ ఆర్డర్ తీసుకుని వచ్చిన నేపథ్యంలోనే మీ ఆరుగురుని మంత్రి పదవుల నుంచి బర్తరప్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని కుమార స్వామి ఘాటుగా బదులిచ్చారు. స్పీకర్, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడంతో సుధాకర్ వెనక్కు తగ్గారు. సభ్యులందరి పట్లా తనకు గౌరవం ఉందని, ప్రతిపక్షాల అర్థంపర్థంలేని వ్యాఖ్యలతో అసహనానికి గురై ఇలాంటి వ్యాఖ్యలు చేశానని, తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles