BJP MP Ram Swaroop Sharma found dead at Delhi residence ఢిల్లీ నివాసంలో హిమాచల్ బీజేపి ఎంపీ మృతి.!

Bjp mp ram swaroop sharma found dead at delhi home suicide suspected

Ram Swaroop Sharma, Mandi MP found dead, Himachal MP found dead, Mandhi MP suicide, Himachal BJP MP Suicide, BJP MP found dead, BJP parliamentary party meeting, Mandi, Member of Parliament, Suicide, BJP MP, Gomti Apartments, Delhi, Himachal Pradesh, Crime

A BJP MP from Himachal Pradesh, Ram Swaroop Sharma, was found dead at his residence in Delhi today, the police said, adding they are investigating whether it was a case of suicide. Mr Sharma, 62, was found hanging in his room, Delhi Police PRO Chinmoy Biswal said.

ఢిల్లీ నివాసంలో హిమాచల్ బీజేపి ఎంపీ రామ్ స్వరూప్ శర్మ మృతి.!

Posted: 03/17/2021 12:50 PM IST
Bjp mp ram swaroop sharma found dead at delhi home suicide suspected

అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఢిల్లీలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ నేత రామ్ స్వ‌రూప్ శ‌ర్మ (62) త‌న నివాసంలో విగతజీవిగా మారడం క‌ల‌క‌లం రేపుతోంది. అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నా.. పోలీసులు మాత్రం ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగానే భావిస్తున్నారు. ఆయన భార్య ఛార్ ధామ్ యాత్రలో ఉన్నందున ఢిల్లీలోని నివాసంలో ఆయన ఒంటరిగా ఉన్నారు. ఇంతలో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం ఆయన కుటుంబంలో విషాధాన్ని నింపింది.

ఇవాళ ఉదయం 7గంటల 45 నిమిషాలకు రామ్ స్వరూప్ శర్మ వ్యక్తిగత సహాయకుడు వచ్చి తలుపు తట్టగా అతను తీయలేదు. దీంతో ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఢిల్లీలోని గోమ్టీ అపార్ట్ మెంట్స్ లోని తన ఇంటికి చేరకుని తలుపులను బలవంతంగా తెరిచేసరికి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి తలుపులు కూడా లోపలి నుంచే గడియ పెట్టివున్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఆయన త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్యకు పాల్పడినా.. అందుకు కారణాలను తెలుపుతూ ఎలాంటి సూసైడ్ నోట్ ను పెట్టలేదని పోలీసులు తెలిపారు.  

అక్క‌డ ప‌లు ఆధారాల‌ను సేక‌రించిన పోలీసులు అనంత‌రం... పోస్టుమార్టం నిమిత్తం ఆయ‌న మృత‌దేహాన్ని గోమ్టీ అపార్ట్‌మెంట్స్ నుంచి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న కేంద్ర స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అక్క‌డ‌కు చేరుకుని పోలీసుల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. రామ్ స్వరూప్ శర్మ ఆకస్మిక మృతిపై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం అంకితభావంతో పనిచేశారని అన్నారు. ఆయనతో పాటు అమిత్ షా కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శర్మ మృతి నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Swaroop Sharma  Mandi  Member of Parliament  Suicide  BJP MP  Gomti Apartments  Delhi  Himachal Pradesh  Crime  

Other Articles