8 killed in 3 massage parlor shootings near Atlanta కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 8 మంది మృతి

Shootings at three atlanta massage parlors leave eight dead police say

mass shooting, I-75 highway, public-safety, Robert Aaron Long, southwest Georgia, Asian descent, Atlanta, US Gun Culture, America Gun Culture, Chicago shooting, Chicago gun fire, South Side Gunfire, South Side shooting, gang-related shooting, US shooting, south side gun fire, Party, Chicago shooting, gun fire, South Side, south side gun fire, Party, shooting, Chicago, US, America, Crime

Shootings at three massage parlors in Atlanta and one in the suburbs left eight people dead, many of them women of Asian descent, authorities said. A 21-year-old man was taken into custody in southwest Georgia hours later after a manhunt.

రెండు రోజుల వ్యవధిలో మళ్లీ కాల్పులతో దద్దరిల్లిన అమెరికా..

Posted: 03/17/2021 12:14 PM IST
Shootings at three atlanta massage parlors leave eight dead police say

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ విష సంస్కృతి పేట్రేగిపోతుంది. ఈ సంస్కృతిని అంతం చేయాలన్న పాలకుల నిర్ణయాలు.. గాలిమూటలుగానే మారుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో అగ్రరాజ్యంలో తుపాకీ కాల్పులుకు పది మంది బలయ్యారు. రెండు రోజుల క్రితం షికాగో నగరంలో జరిగిన ఓ పార్టీలో తుపాకీ కాల్పులు చోటుచేసుకుని ఇద్దరు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఇక తాజాగా ఘటనలో ఏకంగా ఏనమిది మంది అగంతకుడి తుపాకీ గుళ్లకు అసువులు బాసారు. అగ్రరాజ్యంలోని మూడు వేర్వేరు మసాజ్ కేంద్రాల వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

అమెరికాలోని అట్లాంటా పరిధిలో గత రాత్రి మూడు మసాజ్ కేంద్రాలపై ఓ ఆగంతకుడు తన తుపాకీతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తంగా ఎనమిది మంది చనిపోగా ఒకరు గాయాలపాలయ్యారు. ఈ కాల్పులకు బాధ్యుడైన 21 ఏళ్ల యువకుడ్ని పోలీసులు దక్షిణ జార్జియాలో అదుపులోకి తసీుకున్నారు. అతడ్ని రాబర్ట్ అరోన్ లాంగ్ గా గుర్తించారు. అయితే అతను ఈ మసాజ్ కేంద్రాలలోని మహిళలపై ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే కాల్పుల ఘటన చోటుచేసుకన్న గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడం పట్ల జార్జియా గవర్నర్ బ్రెయిన్ కెంప్ పోలీసులను ప్రశంసించారు.

అట్లాంటాలోని మసాజ్‌ పార్లర్‌, స్పాల్లో గ‌త రాత్రి చోరీల‌కు పాల్ప‌డడానికి నిందితుడు రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ ప్ర‌య‌త్నించాడు. దీంతో ఈ స‌మ‌యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న భ‌ద్ర‌తా సిబ్బంది అతడిని గుర్తించి, అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో అక్క‌డున్న వారిపై రాబ‌ర్ట్ కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. దీంతో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అత‌డి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలుగా పోలీసులు గుర్తించారు. మొద‌ట అత‌డు రెండు స్పాల వ‌ద్ద, అనంత‌రం ఓ మసాజ్‌ సెంటర్‌ దగ్గర కాల్పులు జ‌రిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles