Two killed, 13 wounded at party on Chicago’s South Side అగ్రరాజ్యంలో పేట్రేగిపోతున్న ‘గన్ కల్చర్’.. చికాగోలో ఇద్దరు మృతి

2 killed 13 wounded after gunfire erupts at party in chicago s south side

US Gun Culture, America Gun Culture, Chicago shooting, Chicago gun fire, South Side Gunfire, South Side shooting, gang-related shooting, US shooting, south side gun fire, Party, Chicago shooting, gun fire, South Side, south side gun fire, Party, shooting, Chicago, US, America, Crime

Gunfire erupted at a party on Chicago’s South Side early Sunday, killing two people and wounding 13 others, authorities said. Officers responded at around 4:40 a.m., police spokesman Jose Jara said in a statement. Those shot were between the ages of 20 to 44. Jara earlier said 12 people had been shot, but police later raised the figure to 15.

అగ్రరాజ్యంలో పేట్రేగిపోతున్న ‘గన్ కల్చర్’.. చికాగోలో ఇద్దరు మృతి

Posted: 03/15/2021 12:34 PM IST
2 killed 13 wounded after gunfire erupts at party in chicago s south side

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ విష సంస్కృతిని అంతం చేయాలన్న పాలకుల నిర్ణయాలు.. గాలిమూటలుగానే మారుతున్నాయి. పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకూ.. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నాతాధికారుల వరకు ఎవరైనా ఎక్కడైనా.. ఎప్పుడైనా తుపాకీతో సంచరించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడంతో.. తుపాకీ వినియోగం ఎంత అధికంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీచర్ పై తుపాకీతో విద్యార్థి కాల్పులకు తెగబడిన ఘటన.. తన అధికారిపై సిబ్బంది ఇలానే తెగబడిన ఘటన అగ్రరాజ్యంలో చోటుచేసుకున్నాయి.

ఇలా అగ్రరాజ్యంలోని తుపాకీ సంస్కృతి అనేకమంది ప్రాణాలను బలిగొంది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా వున్నప్పుడు తుపాకీ సంస్కృతిని నియంత్రించే దిశగా ఆయన అలోచనలు సాగినా.. అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఫలితంగా దశాబ్దాలుగా ఎన్నో ఘటనల్లో అనేకమంది తుపాకీ గుళ్లకు బలవుతూనే వున్నారు. మరెందరో క్షతగాత్రులై తుపాకీ సంస్కృతికి సాక్షాలుగా నిలిచారు. తాజాగా షికాగో నగరంలో ఓ పార్టీలో తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 13 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

చికాగో నగరంలోని ఓ పార్టీలో ఇరు గ్యాంగ్ లకు మధ్య రేగిన వివాదం.. అభంశుభం తెలియని 47 ఏళ్ల మహిళను సైతం బలిగొనింది. సంఘటన స్థలం నుంచి షికాగో పోలీసులు నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది గ్యాంగ్ వార్ అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షికాగో కూడా ఒకటి. ఇక్కడ 2020లో తుపాకీ కాల్పుల కారణంగా 760 మందికి పైగా మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles