Vijayakanth’s DMDK quits AIADMK-BJP allianceఅన్నాడీఎంకేతో బంధాన్ని తెంచుకున్న డీఎండీకే.!

Tamil nadu assembly election vijayakanth s dmdk quits aiadmk bjp alliance

DMDK quits AIADMK-led alliance, Vijayakanth, DMDK, PMK, L K Sudhish, K P Munusamy, BJP, AIADMK, Tamil Nadu assembly election, AIADMK-led alliance, Tamil Nadu, Politics

Actor Vijayakanth’s DMDK on Tuesday announced its decision to quit the AIADMK-led alliance over differences in sharing of seats. In a statement, Vijayakanth made an announcement to this effect after holding a meeting of district secretaries at the party headquarters.

అన్నాడీఎంకే కూటమి నుంచి విజయకాంత్ డీఎండీకే పార్టీ ఔట్.!

Posted: 03/09/2021 04:47 PM IST
Tamil nadu assembly election vijayakanth s dmdk quits aiadmk bjp alliance

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్నిపార్టీలు సమాయత్తం అవుతున్న తరుణంలో అధికార అన్నాడీఎంకే పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. అందులోనూ పార్టీ అధినేత్రి.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అమె లేకుండా.. అమె ప్రచారం లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో పట్టువిడుపులకు వెళ్లా్ల్సిన పార్టీ.. మంకుపట్టుకు వెళ్తుందన్న అరోపణలు వినబడుతున్నాయి.

అన్నాడిఎంకే పార్టీతో కలసి గత కొన్ని పర్యాయాల నుంచి మిత్రపక్షంగా కొనసాగుతున్న నటుడు విజయకాంత్ పార్టీ.. ఒకానోక ధశలో తమిళనాట ప్రతిపక్ష పార్టీగా కూడా వ్యవహరించింది. అలాంటి పార్టీ తాజా పరిణామాల నేపథ్యంలో కూటమికి దూరంగా జరిగడం.. సంచలనంగా మారింది. డీఎండీకే పార్టీ.. అన్నాడీఎంకే- బీజేపి కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డీఎండీకే పార్టీ ఉప కార్యదర్శి ఎల్ కె సుదీష్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు రౌండ్ల చర్చల తరువాత కూడా సీట్ల సర్ధుబాటు విషయంలో తమకు అన్నాడీఎంకే పార్టీకి మధ్య అవగాహన కుదరలేదని దీంతోనే తాము ఆ కూటమి నుంచి వైదొలుగుతున్నామని అన్నారు.

కూటమిలో తమకు తగిన ప్రాధాన్యం లభించకపోతే.. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేసేందుకు కూడా సిద్దంగా వున్నామని సూచన ప్రాయంగా సంకేతాలిస్తూ వచ్చామని అన్నారు. తమకు అనుకున్న స్థాయిలో స్థానాలను కేటాయించేందుకు అన్నాడీఎంకే పార్టీ సుముఖంగా లేకపోవడంతో తాము ఆ కూలమి నుంచి బయటకు వస్తున్నామని జిల్లా కార్యదర్శుల సమావేశంలో విజయకాంత్ స్పష్టం చేశారని తెలిపారు. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే స్లీపర్ సెల్ ఒకటి పనిచేస్తోందని అదే డిఫ్యూటీ కో-ఆర్డీనేటర్ కేపీ మునుస్వామి అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన కూటమి పార్టీలను సాగనంపే బాధ్యతను కూడా మోస్తున్నారని వ్యంగవ్యాఖ్యలు చేశారు. తమ డీఎండీకే పార్టీ మొత్తంగా 41 స్థానాలను కోరిందని, అయితే చివరకు 25 స్థానాలను కేటాయించాల్సిందా కోరామని, ఇక చివరగా మరో కూటమి పార్టీ అయిన పీఎంకే మాదిరిగానే 23 స్థానాలను డిమాండ్ చేశామని.. అది కూడా సాధ్యపడదని ఆయన చెప్పడంతో ఇక కూటమి నుంచి వైదొలగడమే మంచిదని తాము నిర్ణయించుకున్నట్లు సుధీశ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayakanth  Tamil Nadu assembly election  pmk  L K Sudhish  K P Munusamy  dmdk  BJP  AIADMK  Tamil Nadu  Politics  

Other Articles