Auto Driver's dance on marathi song goes viral నెట్టింట్లో ఈ ఆటోవాలా డాన్స్ వైరల్.. ప్రముఖుల కితాబు..

Viral video auto driver s dance on wajle ki bara lavni marathi song goes viral

Baramati Rishawala Viral video, Marathi lavni, lavni shorts, lavni status, Marathi lavni song, lavni dance, new lavni, new lavni song, New Lavni dance, wajle ki bara, vajle ki bara lavni, wajle ki bara lavani song, wajle ki bara lavni dance, vajle ki bara lavni song auto driver, Maharashtra, National, politics

The Netizens appaulse this auto driver.. few celebrities have even called up him and appreciated him on his dance performance on a song in Marathi 'Wajle ki bara lavni' goes viral on online.

ITEMVIDEOS: నెట్టింట్లో ఈ ఆటోవాలా డాన్స్ వైరల్.. ప్రముఖుల కితాబు..

Posted: 03/09/2021 12:30 PM IST
Viral video auto driver s dance on wajle ki bara lavni marathi song goes viral

మనలో దాగివున్న టాలెంట్ బయటపడిన తరుణంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేషస్ వస్తుందనడంలో సందేహమే లేదు. రైల్వే స్టేషన్లో కూనీ రాగాలు తీసే ఓ వృద్ద మహిళలోని గాత్రాన్ని గుర్తించినంతనే వీడియోను అప్ లోడ్ చేయడంతో అమె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యింది. అంతేకాదు ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకులు అమెకు తన సినిమాల్లో పాడేందుకు చక్కని ఆఫర్ ను కూడా అందించారు. అంతే అమె సెలబ్రిటీ స్టేటస్ తో అమెకు అప్పటివరకు వున్న పేదరికం కూడా తన్నుకుపోయింది. ఇక ఇలాంటి అరుదైన టాలెంట్ ను ఓ ఆటో డ్రైవర్ ప్రదర్శించాడు.

అంతే ఇప్పడు అతను కూడా సెలబ్రిటీ స్టేటస్ ను అనందిస్తున్నాడు. ఎంతలా అంటే ఆయనకు నేరుగా ప్రముఖులు ఫోన్ చేసి.. ఎంతో కఠోర శిక్షణ, అభ్యసం వుంటే కానీ సాధ్యం కానీ కఠిన స్టెప్పులను కూడా అత్యంత సులభంగా వేసి.. రంజింప చేశావ్ అంటూ కితాబిస్తున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. ఫూణేకు చెందిన ఒక ఆటో డ్రైవర్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాట్సాఫ్ ద్వారా ఈ వీడియో అత్యధికంగా షేర్ అవుతూ.. ట్రెడింగ్ లో వుంది. ఈ వీడియోలోని డాన్సును చూసి నెట్ జనులు ఫిదా కాకుండా ఉండలేకపోతున్నారు. కామెంట్లతో డాన్సర్ కు జోష్ పుట్టిస్తున్నారు.

బాబా కాంబ్లే అనే ఆటో డ్రైవర్ డాన్స్ చేసిన వీడియోలో.. మరాఠి పాటపై డాన్స్ చేశాడు. మరాఠీలోని.. లవ నీ ఒరవడిలో సాగే జానపద పాట అటోలో పెద్ద సౌండ్ తో పెట్టగా దానిపై ఆయన చేసిన డాన్స్ అందిరీనీ ఆకట్టుకుంటోంది. ఎంతో క్లిష్టమైన డాన్స్ మూవ్ మెంట్స్ ను కూడా అత్యంత అవలీలగా వేసి అక్కడున్న సహచరులనే కాదు.. ఆ వీడియో చూస్తున్న నెట్ జనులను కూడా విస్మయానికి గురిచేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వివరాల్లోకి వెళితే బాబా కాంబ్లేతో పాటు అతని స్నేహితులు మాలెగావ్ లోని ఒక పెట్రోల్ బంకుకు వచ్చారు. అయితే వారు వచ్చిన సమయంలో విద్యుత్ లేనందున పెట్రోల్ కొట్టించుకునేందుకు మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఈ సమయంలో బాబా కాంబ్లే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. తోటి స్నేహితులు అతనికి ఉత్సాహాన్నివ్వడంతో బాబా కాంబ్లీ డాన్స్ ఇరగదీశాడు. అక్కడున్నవారు తమ సెల్‌ఫోన్‌లలో దీనిని చిత్రీకరించుకున్నారు. ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కాంబ్లే తెగ మురిసిపోయాడు. అంతేకాకుండా అతని డ్యాన్స్ చూసిన కొందరు సెలబ్రిటీలు ఫోన్‌చేసి అతనిని అభినందిస్తున్నారు. బారామతి తాలూకాలోని గున్వాడికి చెందిన బాబా కాంబ్లే గ్రామ పంచాయతీ సభ్యునిగానూ వ్యవహరిస్తున్నాడు. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ను ఇష్టపడే ఆయన వివిధ నృత్య రీతులను నేర్చుకున్నాడు. అయితే సరైన అవకాశాలు అందక, ఆటోనడుపుతూ పొట్ట పోషించుకుంటున్నాడు. ఒక్క రాత్రిలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో బాబా కాంబ్లే ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles