ఈ చిన్నారి మృత్యుంజయురాలే. ఎందుకలా అంటున్నారంటే.. ఈ చిన్నారి ఏకంగా 12 వ అంతస్తు నుంచి కింద పడినా.. స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. ఔనా.? అదెలా అంటే.. అమెను ముందుగానే గమనించిన ఓ డెలివరీ బాయ్ అమెను కింద పడకుండా పట్టుకుని ప్రాణాలను కాపాడగలిగాడు. బిడ్డ 12వ అంతస్థు బాల్కనీ లోంచి కిందకు దిగడం.. ఒక్క చేత్తో బాల్కనీని పట్టుకోవడాన్ని ఆఖరు నిమిషంలో చూసిన తల్లి.. పెద్ద పెట్టును ఏడ్చేసింది. అమె దేవుడా అని పిలిచిన పిలుపుతో దేవుడిలానే డెలివరీ బాయ్ వచ్చి అమెను రక్షించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. వియత్నాంలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయం వద్ద తన ట్రక్కులో కూర్చోని.. తన తదుపరి డెలివరీ ఇవ్వాల్సిన హనోయ్ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్దమవుతున్నాడు. ఈ లోగా డెలివిరీ ఇచ్చేందుకు వెళ్లిన బాయ్ రాక కోసం నిరీక్షిస్తుండగా, అతనికి అక్కడి భవనంలోని 12వ అంతస్థ బాల్కనీ నుంచి ఓ చిన్నారి బయటకు వచ్చిన దృశ్యం కనిపించింది. అంతేకాదు ఒక్క చేత్తో అమె ఊగుతూ కనిపించింది.
¡HEROICA ATRAPADA!
— Unicanal (@Unicanal) March 1, 2021
Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam.
La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM
ఆ చేతిని కాస్తా వదిలేస్తే అమె సరాసరి కింద పడుతోందని చూసి.. క్షణం అలస్యం చేయకుండా పరుగుపరుగు వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్మించిన అంతస్థును ఎక్కాడు. ఇక అక్కడి నుంచి బాలిక ఎప్పుడు పడుతుందా.. అమెను ఎలా పట్టుకుందామా.? అన్న అలోచనలోనే వున్నాడు. ఈ క్రమంలో అతనికి బిడ్డ తల్లి పెద్ద పెట్టున చేసిన భీకర ఏడుపు శబ్దం వినిపించింది. అంతే అప్రమత్తంగా వుంటూ చిన్నారిని పట్టుకున్నాడు. అయితే కాసింత జారుతున్న ఒకటవ అంతస్థు కారణంగా చిన్నారికి స్వల గాయమైంది. కాగా డెలివరీ బాయ్ కి మాత్రం కాలు ఫ్రాక్చర్ అయ్యిందని సమాచారం. అయినా ఆయన చేసిన ప్రయత్నాన్ని కొనియాడుతున్న నెట్ జనలు ఆయనను హీరోను చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more