Taj Mahal bomb threat call to be a hoax పర్యాటకుల కోసం తెరుచుకున్న తాజ్ మహల్

Agra bomb scare taj mahal reopens for tourists after investigation

taj mahal, taj mahal bomb threat, taj mahal bomb call, bomb hoax taj mahal, taj mahal security, Police, taj mahal, bomb scare, bomb threat call, Mughal-era monument, Archaeological Survey of India (ASI), Agra, Firozabad, Uttar Pradesh, Crime

The iconic Taj Mahal in Uttar Pradesh's Agra was vacated on March 4 after a bomb threat call, which after an extensive search was found to be a hoax, news reports have said. The Mughal-era monument was briefly shut and tourists moved out as security forces combed the premises.

తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కాల్.. ఉత్తదేనని తేల్చిన పోలీసులు

Posted: 03/04/2021 12:33 PM IST
Agra bomb scare taj mahal reopens for tourists after investigation

ప్రపంచంలో ఆరవ వింతగా నిలిచిన పాలరాతి శిల్ప నిర్మాణం తాజ్ మహల్ లో బాంబు పెట్టానని ఓ అగంతకుడు చేసిన ఫోన్ కాల్ తో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. అణువణువూ గాలించిన తరువాత ఆ ఫోన్ కాల్ ఉత్తదేనని తేల్చారు. అయితే ఫోన్ కాల్ రావడంతోనే నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శించినే ఈ మొగల్ సామ్రాజ్యపు అద్భుత కట్టడంలో సందర్శకులను అనుమతించలేదు. స్వదేశీ, విదేశీల పర్యాటకులను తాజ్ మహల్ నుంచి బయటకు పంపించిన అధికారులు భారతీయ వారసత్వ కట్టడాన్ని పూర్తిగా తమ అధుపులోకి తీసుకున్నారు.

భారత పురావస్తు శాఖ తాజ్ మహల్ పర్యవేక్షణ నిర్వహిస్తుండగా, ఇక్కడ ఎలాంటి అసంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా నిత్యం సీఐఎస్ఎఫ్ బృందాలు పహారా కాస్తుంటాయి. అలాంటిది వారిని తప్పించుకుని వచ్చి తాజ్ మహల్ లో బాంబు పెట్టారన్న ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉదయం తొమ్మది గంటల సమయంలో ఓ అగంతకుడు ఉత్తర్ ప్రదేశ్ పౌరుల అత్యవసర నెంబరు 112కు ఇవాళ ఫోన్ వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు కనుగొన్నారు.

అయితే ఫోన్ చేసిన వ్యక్తి తాను తాజ్ మహల్ లో బాంబు పెట్టాలనని చెప్పాడు. తనకు సైనిక నియామకాల్లో ఉద్యోగం రాలేదని, దీంతో ప్రభుత్వంపై ఆగ్రహంతోనే తనాు తాజ్ మహాల్ లో బాంబు పెట్టానని అతను పోలీసులకు తెలిపాడు. సైనిక నియామకాల్లో అవకతవకలు జరుగుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు తాను ఈ పనికి పాల్పడినట్టు అగంతకుడు చెప్పాడు. ఈ అవకతవకాల కారణంగానే తనకు ఉద్యోగం లభించలేదని చెప్పాడు. ఇంతా చెప్పిన అగంతకుడు.. తాను పెట్టిన బాంబు త్వరలోనే పేలుతుందని కూడా చెప్పాడు.

దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై తాజ్ మహల్ ను పహారా కాస్తున్న సీఐఎస్ఎస్ సిబ్బందితో పాటు ఇటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. తాజ్ మహాల్ లోని పర్యాటకులను వెంటనే బయటకు పంపిన సిబ్బంది.. అణువణువూ గాలించినా ఎక్కడా, ఎలాంటి బాంబు లభించలేదు. దీంతో ఇది ఉత్తత్తదేనని తేల్చారు. ఆ తరువాత మళ్లీ తాజ్ మహల్ లోకి పర్యాటకులను పంపారు. ఈ బెదిరింపు కాల్ పిరోజాబాద్ నుంచి వచ్చిందని తెలుసుకున్నామని, ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles