Come April, Sharmila to shed light on party వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు..!

Ys sharmila may announce launch date of party on april 9

YS Sharmila to announce new party on April 9, sharmila new Political party announcement on April 9, Sharmila new political party name, YS Sharmila, Telangana politics, Khammam, Konda Raghava Reddy, New political party announcement, TRS, congress, BJP, TDP, Telangana, Politics

Y. S. Sharmila, daughter of late Chief Minister Y. S. Rajasekhara Reddy, and sister of AP Chief Minister Y.S. Jaganmohan Reddy, is most likely to announce the launch date on April 9 at a public meeting in Khammam. Sources privy to the discussions held between Ms. Sharmila and a few loyalists of late Rajasekhara Reddy on Monday maintained that three dates were deliberated.

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు..!

Posted: 03/02/2021 12:13 PM IST
Ys sharmila may announce launch date of party on april 9

తెలంగాణ ఇంటి కోడలినంటూ అదే మెట్టినిల్లు లాజిక్ తో ఇక్కడి రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగప్రవేశం చేయునున్న వైఎస్ షర్మిల ఇప్పటికే జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి, సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. ఇక మరికొన్ని జిల్లాల నేతలతోనూ ఈ సమాలోచనలు జరపాల్సి వుంది. ఈ క్రమంలో ఈ సమావేశాలన్ని పూర్తి చేసుకున్న తరువాత  అమె తన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారని అమె అనుచరగణం స్పష్టం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిలగా అమె ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారా.? లేక అన్నతో పోరాడైనా తెలంగాణ ప్రజానికం సంక్షేమానికి కట్టుబడి వుంటారా.? అన్న ప్రశ్నలు విపక్షల నుంచి ఎదురవుతున్నాయి.

ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కర్నూలు సెంటర్ లో నిలబడి.. తెలంగాణ ప్రజలకు పక్షాణ తాను ఇక్కడి ప్రజకు అండగా నిలుస్తానని అమె ప్రకటించాలని డిమాండ్ చేశారు. కృష్ణ నదీజలాలల్లో తెలంగాణనీళ్ల వాటా కోసం తాను పోరాటం సల్పుతానని అమె ప్రకటిస్తేనే అప్పుడు తెలంగాణ ప్రజలు అమెను విశ్వసిస్తారని రేవంత్ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా స్వయం పాలన,, స్వాభిమానం పేరున కూడా జరిగిందన్న విషయాన్ని తెలంగాణవాదులు ఇప్పటికే గుర్తు చేస్తున్నారు. నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు స్వయం పాలన కూడా అప్పటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిందని అన్నారు.

ఇదిలావుంటే తెలంగాణలో జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు ముగిసిన తర్వాత షర్మిల ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తారని ఆమె అనుచరుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి వాటిని కూడా ఆ రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. షర్మిల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలు, తాగు, సాగునీరు వంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వచ్చే నెల 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమావేశం ఉంటుంది. అదే రోజున పార్టీని ప్రకటించే అవకాశం ఉందని దేవేందర్‌రెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles