Woman carries husband on shoulders to celebrate victory బాంబే హైకోర్టులో విరసం నేత వరవర రావుకు ఊరట..

Activist varavara rao gets further relief from bombay hc in bail conditions

Activist Varavara Rao gets further relief, Varavara Rao gets relief from Bombay HC, Bombay HC changes bail formalities for Varavara Rao, varavara rao, Bombay High Court, Bail petition, cash security, Elgar parishad, Rs 50 Lakh surity, Maharashtra, crime

Bombay High Court has allowed Elgaar Parishad case accused Varavara Rao to deposit temporary cash security to get released on bail till arrangements for the two solvent sureties are made by April 5.

బాంబే హైకోర్టులో విరసం నేత వరవర రావుకు ఊరట..నగదు పూచికత్తు..

Posted: 03/02/2021 11:11 AM IST
Activist varavara rao gets further relief from bombay hc in bail conditions

ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బెయిల్ ష్యూరిటీ విషయంలో ఆయన ఎదుర్కోంటున్న ఇబ్బందులను ఆయన తరపు సినియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ బాంబే హైకోర్టుకు తీసుకువెళ్లగా.. జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు బెయిల్ ష్యూరిటీగా రెండు నగదు పూచికత్తును ఇవ్వాల్సిందిగా అదేశాలు జారీ చేసింది. దీంతో వరవరరావు బెయిల్ పై విడుదల అయ్యేందుకు ఎట్టకేలకు మార్గం సుగమం అయ్యింది. ఇక త్వరలో వరవరరావు బెయిలుపై జైలు గోడల నుంచి విముక్తి పోందనున్నారు.

వరవరరావుకు గత నెల (ఫిబ్రవరి) 22న బెయిల్ లభించినా, మహారాష్ట్రలోని బెయిల్ ష్యూరిటీ నిబంధనల కారణంగా ఆయన విడుదల ఆలస్యం అయింది. మహారాష్ట్రలో బెయిల్ ష్యూరిటీకి ఆస్తి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. నగదు పూచీకత్తులు, శాలరీ సర్టిఫికెట్లను ఇక్కడ అంగీకరించరు. దాంతో వరవరరావు విడుదల కోసం కుటుంబ సభ్యుల తరపున సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ మరోమారు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, వరవర రావు బెయిల్ లభించిన రోజులు గడుస్తున్నా.. ఇక్కడి నిబంధనల కారణంగా ఆయన విడుదల ఆలస్యం జరుగుతుందని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ది.

దీనిపై విచారించిన న్యాయస్థానం వరవర రావు బెయిల్ విషయంలో నిబంధనలను మార్చింది. వరవర రావు బెయిల్ విషయంలో ఆయన రూ. 50 వేల చోప్పున రెండు నగదు పూచీకత్తులను ఏప్రిల్ 5వ తేదీలోపు సమర్పించాలని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో వరవర రావు కుటుంబసభ్యులు ఆయన విడుదల కోసం రూ,50 వేల విలువ చేసే రెండు నగదు పూచీకత్తులను సిద్దం చేశారు. దీంతో ఇవాళ ఆయన బెయిల్ పత్రాల ప్రక్రియ పూర్తి కానుంది. ఇది పూర్తైన వెంటనే వరవరరావు ముంబయిలోని తలోలా జైలు నుంచి విడుదల కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles