Punjab housewife bags Rs 1 crore in lottery రూ.100 తో కోటి రూపాయలను దక్కించుకున్న గృహిణి

Amritsar housewife bags rs 1 crore from lottery ticket that cost rs 100

Punjab housewife wins Rs 1 crore lottery, Punjab housewife wins first prize in lottery, Amritsar housewife wins punjab monthly lottery, Renu Chauhan, Housewife, Rs 1 Crore, Lottery Prize, Punjab State monthly lottery, cloth shop, Lottery, Winner, Amritsar, Punjab

A housewife from Amritsar has won the first prize in a lottery worth Rs 1 crore from a ticket that cost her Rs 100. As per a statement from the state government, the lucky winner, Renu Chauhan, submitted the ticket and required documents to the State Lotteries Department for encashment of her prize.

రూ.100 తో కోటి రూపాయలను దక్కించుకున్న గృహిణి

Posted: 02/26/2021 12:36 PM IST
Amritsar housewife bags rs 1 crore from lottery ticket that cost rs 100

కరోనా కష్టకాలం పేద, మధ్య తరగతి ప్రజలను మరీ ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక చిరు వ్యాపారుల కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్ని మరింత దిగజార్చింది. ఈ క్రమంలో అన్ లాక్ తరువాత కూడా అంతకంతకూ పెరుగుతున్న ధరలతో ఈ వర్గాల పరిస్థితి పెనం మీద నుంచి పోయిలో పడేలా చేసింది. అయితే ఈ గృహిణిని ఆశలను మాత్రం అనుకున్న దానికన్నా మరింత ఎక్కువగానే మార్చేంది. ఏకంగా ఈమె ఇంటిని లక్ష్మీదేవి తలుపుతట్టి.. రాత్రికి రాత్రి లక్షాధికారిణి చేసింది.

అదెలా సాధ్యం.. అంటారా.. అమె అనుకోకుండా కొన్న లాటరీ టిక్కెట్ కు కోటి రూపాయల ప్రథమ బహుమతి లభించింది. ఔనా.. ఇంతకీ ఆ టిక్కెట్ ధర ఎంత అంటారా.? కేవలం వంద రూపాయలే. దీంతో అమె కుటుంబంలో కష్టాలు తీరి సుఖసంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. సంబరాలు చేసుకుంటున్నారు. సాధరణంగా ఈ తరహా లాటరీ బహుమతుల్లో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈ సారి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో ఓ సాధారణ మధ్యతరగతి గృహిణికి ఈ లాటరీ టిక్కెట్ బహుమతి వరించడం చర్చనీయాంశంగా మారింది.

అమృత్ సర్ కు చెందిన రేణూ చౌహాన్ సాధారణ మధ్యతరగతి గృహిణి. అయితే తన భర్త మాత్రం చిన్న వస్త్రాల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన భర్తకు మధ్యాహ్నం బోజనం తీసుకెళ్తూ ఓ రోజున అమె కంట పడిన లాటరీ టిక్కెట్ ను వంద రూపాయలు పెట్టి కొనింది. అంతే అమె ఇంటిని అదృష్టం తలుపుతట్టి ఏకంగా ప్రథమ బహుమతిగా కోటి రూపాయలను అందుకోనుంది. ఆ లాట‌రీకి సంబంధించిన డ్రాను అధికారులు ఫిబ్ర‌వ‌రి 11న తీశారు. ఆ డ్రాలో రేణూ కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్ D-12228‌కు మొద‌టి బ‌హుమ‌తి త‌గిలింది.

దీంతో పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం రేణూ చౌహాన్‌ను విజేత‌గా ప్ర‌క‌టించింది. ప్రైజ్ మనీ పొందేందుకు కావాల్సిన డాక్యుమెంట్ల‌ను రాష్ట్ర లాట‌రీస్ శాఖలో రేణూ గురువారం స‌మ‌ర్పించింది. త్వరలోనే ఆమెకు కోటి రూపాయల నగదు చేరుతుందని రాష్ట్ర లాటరీ శాఖ అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా రేణూ చౌహాన్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. లాటరీ డాక్యుమెంట్లను సమర్పించిన అనంతరం రేణూ చౌహాన్ మాట్లాడుతూ.. భ‌గ‌వంతుడి ఆశీస్సుల‌తోనే త‌న‌కు లాట‌రీ త‌గిలింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. త‌మ కుటుంబం సంతోషంగా జీవించేందుకు ఈ నగదు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆమె వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles