Ganta questions BJP leaders on privatization of Steel Plant ప్రధాని స్పష్టత.. బీజేపి నేతలకు గంటా సూటి ప్రశ్న..!

Tdp mla ganta srinivas rao questions bjp leaders on privatization of steel plant

Ganta Srinivasa Rao, TDP MLA, Andhra BJP leaders, PM Modi, Privatization of PSU, Visakha steel plant, somu veerraju, ISPAT, Vishaka steel Plant, trade Union agitation, Visakhapatnam North Constituency, non-political JAC, Vishakapatnam, Andrha Pradesh, Politics

TDP MLA Ganta Srinivasa Rao has questioned Andhra Pradesh BJP leaders on their extension of support to the protest against the privatization of the Visakhapatnam Steel Plant. He said that PM Modi has given clarity on privatisation of visakha steel plant.

స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు మోడీ సంకేతాలు.. బీజేపి నేతలను ప్రశ్నించిన గంటా

Posted: 02/26/2021 11:36 AM IST
Tdp mla ganta srinivas rao questions bjp leaders on privatization of steel plant

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఇకపై ప్రభుత్వాలు నడపలేమని.. దేశంలో వాటిని వ్యవస్థాపన జరిగిన నాటి పరిస్థితులు వేరు.. ప్రస్తుత పరిస్థితులు వేరు అని ప్రధాని మోడీ ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకోరని స్పష్టంగా సంకేతాలు ఇచ్చారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వాలు వ్యాపారం చేయడం సమంజసం కాదని, వ్యాపారం పేరుతో యువ మేధావులను ప్రభుత్వం వదులుకునేందుకు తాము సిద్దంగా లేదని ప్రధాని గంటాపథంగా చెప్పారని గంటా అన్నారు.

ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు తాజాగా ప్రధాని వ్యాఖ్యలపై బీజేపి నేతలను టార్గెట్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై తమ నిర్ణయం మారదని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారని, దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. బీజేపి నేతలు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రభుత్వ రంగం సంస్థలను ఇకపై భరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తామని అంటున్నారు. కానీ అబ్బే, అలాంటిదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు ఆంధ్రులను మభ్యపెడుతున్నారు. నిన్న ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన ఓ వెబినార్ లో... ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విధంగా ప్రధాని మాట్లాడారని’’ అని అన్నారు. అయినా రాష్ట్రానికి చెందిన బీజేపి నేతలు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదని.. ఇప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ అసాథ్యమని అంటున్నారని ఆయన పేర్కోన్నారు.

ప్రైవేటీకరణపై నోటిఫికేషనే రాకుండానే ఉద్యమాలు ఎలా చేస్తారని బీజేపి రాష్ట్ర నాయకులు కాలయాపన మాటలు చెబుతున్నారని గంటా శ్రీనివాస్ విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడాలని.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా వెంటనే కార్యాచరణ ప్రకటించాలని గంటా డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా మేల్కొనాలని, పదవుల కోసం కాకుండా ప్రాంతం (విశాఖ ఉక్కు కర్మాగారం) కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. 'రండి, ఏకతాటిపై నిలిచి మన విశాఖ ఉక్కును కాపాడుకుందాం' అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles