ఈ మధ్యకాలంలో ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటుతున్న మీడియా జర్నలిస్టులను వారుధులుగా గుర్తించని వారు ఎక్కువగానే వున్నారు. ఆ మాట అటుంచితే.. ఇక వీరిని టార్గెట్ చేసుకునే దొంగల సంఖ్య కూడా అధికం అవుతోంది. మొన్నామధ్య అర్జెంటీనా టీవీ రిపోర్టర్ లైవ్ షోకు సిద్దమవుతుండగా, ఓ అగంతకుడు రిపోర్టర్ ఫోన్ ను అందుకుని పలాయనం చిత్తగించిన ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు ఓ మహిళా జర్నలిస్ట్ లైవ్ షో చేస్తుండగా, ఓ అగంతకుడు అమెకు చుంబనం ఇచ్చి వెళ్లి కటకటాల పాలైన విషయం కూడా తెలిసిందే.
తాజాగా మరో ఘటనలో లైవ్ షో కొనసాగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన ఓ ఘరానా దొంగ టీవీ ఛానెల్ సిబ్బంది, విలేకర్లను దోచేసి తుర్రుమన్నాడు. ఈక్వెడార్ లో చోటుచేసుకున్న ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనమైంది. పట్టపగలు, బహిరంగంగా వారిని తుపాకీతో బెదిరించి.. వారి వద్దనున్న డబ్బు, వస్తువులు దోచుకోవటం అందులో చూడొచ్చు. ఎంత త్వరగా దోచేశాడో అంతే త్వరగా అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే అతనికోసం వేచి చూస్తున్న మరో ఇద్దరు మిత్రుడితో కలసి బైక్ పై జారుకున్నాడు.
వివరా్లలోకి వెళ్తే.. డైరెక్ట్ టీవీ స్పోర్ట్స్ అనే క్రీడా ఛానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న డిగో ఆర్డినోలా తన టీవీ ఛానెల్ సిబ్బందితో ఓ పుట్ బాల్ స్టేడియం వద్దకు చేరుకున్నాడు. ఈక్వాడార్ లోని గువాయాక్విల్ పట్టణంలోని పుట్ బాల్ స్టేడియం వద్దనున్న ఎస్డాడియో మాన్యుమెంటల్ భవనం ఎదుట.. ఫుట్ బాల్ మ్యాచ్ పై విశ్లేషణ అందిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో లైవ్ లో వెళ్తుండగా.. ఓ దొంగ ఆ ప్రసారానికి అడ్డువచ్చాడు. మాస్క్ ధరించిన అతను ఆర్డినోలా వైపు రివ్వాల్వర్ గురిపెట్టాడు. మైక్రోఫోన్ ను లాగేసి ‘‘టెలిఫోన్’’ అంటూ అరిచి దానిని సొంతం చేసుకున్నాడు.
అనంతరం అక్కడున్న మిగిలిన సిబ్బంది వైపు తుపాకీ గురిపెట్టి వారి ఫోన్లు, పర్సులు కూడా తీసుకున్నాడు. ఈ ఘటన అంతా కెమేరాలో రికార్డయింది. ఆ తర్వాత రోడ్డువైపు పరిగెత్తిన దొంగ .. అక్కడ సిద్ధంగా ఉన్న మోటార్ సైకిల్ వెనుక కూర్చుని ఉడాయించాడు. ‘‘మేము కనీసం ప్రశాంతంగా పని కూడా చేసుకోలేకపోతున్నాము. ఇది మధ్యాహ్నం 1:00 గంటకు మాన్యుమెంటల్ స్టేడియం వెలుపల జరిగింది.’’ అంటూ ఆ విలేకరి సామాజిక మాధ్యమాల్లో వాపోయాడు. కాగా పోలీసులు ఆ దొంగను పట్టుకుంటామని హామీ ఇచ్చారట.
Ni siquiera podemos trabajar tranquilos, esto ocurrió a las 13:00 de hoy en las afueras del Estadio Monumental.
— Diego Ordinola (@Diegordinola) February 12, 2021
La @PoliciaEcuador se comprometió a dar con estos delincuentes. #Inseguridad pic.twitter.com/OE2KybP0Od
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more