12-Year-Old Mumbai Autistic Girl, Swims 36 Km In Open Sea సముద్రంలో 36 కిమీ ఈతకొట్టి రికార్డు సృష్టించిన జియా రాయ్

12 year old jiya rai swims 36km in 8 hours to create autism awareness

Jiya Rai, Jiya Rai swimmer, Jiya Rai autism, Autistic swimmer, Madan Rai, Autism Spectrum Disorder, Inspiring videos, Swimming record, autism spectrum, Swimming, special child, Autistic Spectrum Disorder, Autistic swimmer Jiya Rai, naval child, PRO Defence Mumbai, Maharashtra, Politics

Netizens have been showering praise on Jiya Rai, a 12-year-old, who swam from Bandra-Worli Sea Link to Gateway of India in Mumbai on February 17. Jiya Ria, diagnosed with Autistic Spectrum Disorder (ASD) swam in the open sea for 8 hours and 40 minutes.

ITEMVIDEOS: సముద్రంలో 36 కిమీ ఈతకొట్టి రికార్డు సృష్టించిన జియా రాయ్

Posted: 02/19/2021 07:56 PM IST
12 year old jiya rai swims 36km in 8 hours to create autism awareness

అరగంట పాటు ఈత కోడితేనే హమ్మా.. దేవుడా అంటూ అపసోపాలు పడతాము.. కానీ తాను ఏం చేస్తున్నానో కూడా పెద్దగా గుర్తుపెట్టుకోలేని ఓ పన్నెండేళ్ల చిన్నారి బాలిక.. అరేబియా సముద్రంలో 36 కిలోమీటర్లు ఈత కొట్టి రికార్డు సృష్టించింది. బుద్దిమాంద్యంపై అవగాహన కల్పించేందుకు అదే సమస్యను ఎదుర్కోని చికిత్స పొందిన చిన్నారి.. తన చికిత్స పూర్తైన నేపథ్యంలో ఈ అరుదైన సాహసోపేత ఫీటుకు నడుం చుట్టింది. నేవీకి చెందిన సైలర్‌ మదన్ రాయ్ కుమార్తె అయిన 12 ఏళ్ల చిన్నారి జియా రాయ్‌ ఈ ఘనత సాధించింది.

ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ నుంచి 36 కిలోమీటర్ల దూరంలోని గేట్‌ వే ఆఫ్ ఇండియా వరకు సముద్రంలో ఈత కొట్టి కేవలం 8 గంటల 40 నిమిషాల్లో చేరుకున్నది. ఉదయం నాలుగు గంటల సమయంలో ప్రారంభమైన అమె ఈత.. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పూర్తైంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (బుద్దిమాంద్యత)గురించి అవగాహన కల్పించడంలో భాగంగా జియా రాయ్ ఈ ప్రయత్నం చేసి చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రిత్వశాఖ ముంబై విభాగానికి చెందిన పీఆర్ఓ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

జియా సాహసోపేతమైన ఫీటును విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో అమెకు స్విమ్మింగ్ ఫెడరేషన్ అప్ ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ దధే అవార్డుతో పాటు సర్టిఫికేట్ ను కూడా అందజేశారు. అమె పదవ ఏట నుంచే ఈత నేర్చుకుంటోందని అయితే రెండేళ్లలోనే ఇంతటి ఘనత సాధిస్తోందని తాము ఊహించలేదని అన్నారు అమె తల్లి. ఇక జియా రాయ్ ఈత ను మహారాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ తో పాటు భారత్ యువ, క్రీడా వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిట్ ఇండియా మూమ్ మెంట్ సంయుక్తంగా పర్యవేక్షించాయి. ఈ చిన్నారికి నెట్టింట్లో ప్రశంసలు వర్షం కురుస్తుంది. నీ దారి పూల దారి అంటూ అందరూ జేజేలు పలుకుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles