కేంద్రపరిపాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోమారు ఘాతుకానికి తెగబడ్డారు. బఘాట్ ప్రాంతంలో నిరాయుధులైన పోలిసులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. అసలేం జరుగుతుందో కూడా తలియని జనాలు తుపాకీ కాల్పుల శబ్దాలు విని తేరుకుని చూసే లోపు కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుస్తుల్లో తుపాకీని దాచుకుని వచ్చిన ముష్కరుడు.. పోలీసుల వద్దకు వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరపాడు.
ఈ కాల్పుల్లో జుర్హమా కుప్వారాకు చెందిన కానిస్టేబుల్ మహమ్మద్ యూసుఫ్, లోగ్రిపోరా ఐష్ముకంకు చెందిన కానిస్టేబు్ సుహేల్ అహ్మద్ లను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మహమ్మద్ యూసుప్ ఘటనాస్థలంలోనే మరణించగా, సుహేల్ అహ్మద్ మాత్రం అసుపత్రికి తరలించిన చికిత్స కొనసాగుతుండగా మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాదిని పట్టుకునేందుకు ఇద్దరు యువకులు సిద్దం కాగా, అదే సమయంలో అటుగా వచ్చిన మారుతి కారును చూసి ఉగ్రవాది అందోళనకు గురై పారిపోయాడు. ఇదే క్రమంలో తమపై కూడా తూటాలను వదులుతాడని భావించిన యువకులు వెనుదిరిగారు.
అదే అదనుగా భావించిన ముష్కరుడు క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి మొత్తాన్నితమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీలో లభించిన ఫూటేజీని పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఈ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఉగ్రవాది కాల్పులకు తెగబటడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. దుండగుడి కోసం పోలీసులు అన్వేషణ సాగుతోంది. ముష్కరుడు అధిక దూరం వెళ్లే అవకాశం లేదని.. భావిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు తీవ్రం చేశారు.
నిరాయుధులైన కానిస్టేబుళ్లను వెనుక నుంచి, దొంగరీతిలో దాడులు చేసి హతమార్చడం పట్ల వీరమరణం పోందిన కానిస్టేబుళ్లు మహమ్మద్ యూసుప్,సుహేల్ అహ్మద్ లకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నమాని జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగం ట్విట్టర్ లో పోస్టు చేసింది. వీరుల కుటుంబాలకు తాము నిత్యం అందుబాటులో వుంటామని, ముఖ్యంగా ఈ విషాద సమయంలో వారికి అండగా నిలుస్తామని తెలిపింది. ఇక కానిస్టేబుళ్లను హతమార్చడం పట్ల పిడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
24 దేశాలకు చెందిన దౌత్యాధికారులు ఇవాళ ఉదయం కాశ్మీర్ కు చెరుకున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. రెండు రోజుల పాటు వివిధ దేశాల దౌత్యాధికారులు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇక గత మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. అత్యంత భద్రత ఉండే దుర్గనాగ్ ప్రాంతంలోని కృష్ణా రెస్టారెంట్ ఓనర్ కుమారుడిపై రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపి హతమార్చిన ఘటన మరువక ముందే ఇవాళ ఇద్దరు కానిస్టేబుళ్లను ఉగ్రవాదులు హతమాచ్చడం గమనార్హం.
#WATCH Terrorist opens fire in Baghat Barzulla of Srinagar district in Kashmir today
— ANI (@ANI) February 19, 2021
( CCTV footage from police sources) pic.twitter.com/FXYCvQkyAb
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more