Grand celebrations of Ratha Saptami at Tirumala Hills తిరుమాఢ వీధుల్లో ఘనంగా రథసప్తమి వేడుకలు..

Devotees throng tirumala tiru mada streets on the eve of ratha saptami

Rathasapthami, Sun God Birth Anniversary, Surya Bhagwan, malayappa swamy, Tirumala, Tirumada vidhulu, SuryaPrabha Vahanam, Tirupati, suryanarayana swamy, Tirumala Rathasapthami, Ratha Sapthami festival, Achala Saptami, Arogya Saptami, Devotees, Srikakulam, Andhra Pradesh, Devotional news

Ratha Saptami, is celebrated in the Hindu month of Magha, in the brighter phase of moon in seventh day, which is celebrating grandly the birth anniversary of Surya Bhagwan (the Sun God) at Tirumala Tirupati Devasthanam. This is the first time after corona season the Vahana Seva is performed to the lord in Tirumada Vidhulu.

శ్రీవారి పాదాలను తాకిన అరుణ కిరణాలు.. పరవశించిన భక్తులు

Posted: 02/19/2021 11:54 AM IST
Devotees throng tirumala tiru mada streets on the eve of ratha saptami

సూర్యభగవానుడి జన్మదినమైన రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సూర్యనారాయణ మూర్తిగా భక్తజనులు ఆరాధించడం.. దీంతో రథసప్తమినాడు మలయప్ప స్వామికి సప్తవాహన సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచే మలయప్ప స్వామివారిని టీటీడీ అధికారులు ఉదయం నుంచే సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంపై కోలువై తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ అక్కడ కోలువైన భక్తజనకోటికి అభయప్రధానం చేశారు.

ఉదయం ఐదున్నర నుంచి 8 గంటల వరకూ సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమాడ వీధుల్లో పెద్ద సంఖ్యలో కొలువుదీరిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కరోనా అనంతరం మొదటిసారి తిరుమాడ వీధుల్లో వాహనాలపై ఊరేగడంతో భక్తులు తిరుమల కోండకు పొటెత్తారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే వాహన సేవలు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవతో ముగియనుంది. ఈ క్రమంలో ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు మలయప్ప స్వామి పాదాలను తాకాయి. దీంతో గ్యాలరీల్లోని భక్తులు ఈ కమనీయ దృశ్యాన్ని చూసి తన్మయత్వం పోందారు.

ఇక సూర్యప్రభ వాహన సేవతో పాటు ఇవాళ చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలలో స్వామివారు తిరుమాడ వీధుల్లో సంచరిస్తారు. ఇక చివరన చంద్రప్రభ వాహనంలో ఊరేగించే శ్రీవారు భక్తులకు అభయప్రధానం చేస్తారు. కాగా, రథసప్తమి సందర్భంగా తిరుమల వచ్చే భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది. ఆలయ మాడవీధుల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. ఇవాళ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చనలు ఏకాంతంగా నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles