Grand celebrations of Ratha Saptami at Arasavalli అరసవల్లిలో ఘనంగా సూర్యభగవానుడి జన్మదిన వేడుకలు

Devotees throng arasavalli temple on the eve of ratha saptami

Rathasapthami, Sun God temple, Rathasapthami festival, Achala Saptami, Arogya Saptami, Devotees, Srikakulam, Andhra Pradesh, Devotional news

Among the myriad festivals celebrated in the Hindu month of Magha, the Ratha Saptami, the Arasavalli Temple in Srikakulam district, is celebrating grandly the birth anniversary of Surya Bhagwan (the Sun God), who also gives Arogya to the Man Kind.

అరసవల్లిలో ఘనంగా సూర్యభగవానుడి జన్మదిన వేడుకలు

Posted: 02/19/2021 11:06 AM IST
Devotees throng arasavalli temple on the eve of ratha saptami

యావత్ మానవాళికి ప్రత్యక్షంగా కనిపించే సూర్యభగవానుడి జన్మదినమైన రథసప్తమిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లోని భక్తజనులు వేకువజాము నుంచే దేవాలయాలకు వెళ్లి ప్రత్యక్ష పూజలు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభం కాగా,  స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర ఫీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి. దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్‌ సుజాత అరసవల్లి సూర్యభగవానుడికి పట్టువస్త్రాలను సమర్పించారు.

కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంచెలమైన భక్తి ప్రవత్తుల నడుమ భక్తజనకోటి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఈ క్రమంలో భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుండే సూర్యభగవానుడి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు.

ఇక రథసప్తమిని పురస్కారించుకుని రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్‌, ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్‌కుమార్‌, కంబాల జోగులు, విశ్వసరాయ కళావతి తదితరులు సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామికి తొలి పూజ చేసే అవకాశం రావడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని స్వాత్మానంద మహా సరస్వతి అన్నారు.  

కాగా, ఆరోగ్యప్రదాతగా కీర్తించే స్వామి వారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తజనులు వచ్చినా.. అధికారులు మాత్రం సరైన సౌకర్యాలు చేయడంలో విఫలమయ్యారని భక్తులు అరోపిస్తున్నారు. ప్రత్యేక దర్శనం కోసం 500 రూపాయల టికెట్లు తీసుకున్న వారు కూడా క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిఉండాల్సి వస్తుందని వాపోయారు. ఎలాంటి హోదా లేని వారికి కూడా వీఐపి దర్శనం కల్పిస్తున్నారని, సమాన్య భక్తుల్ని మాత్రం ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతోనే చిన్న చిన్న సమస్యలు తలెత్తాయని ఆలయ సిబ్బంది చెప్పుకొస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles