several still missing in MP's Sidhi bus accident బస్సు ప్రమాదం: 45 మృతదేహాల వెలికితీత.. గాలింపు ముమ్మరం

Sidhi bus accident 45 bodies found several still missing in madhya pradesh s sidhi

Sidhi district bus accident, Sidhi district, sidhi bus accident, satna bus accident, people feared drowned as bus falls into canal, madhya pradesh news, bus falls into canal in Sidhi district, Bus, passengers, canal, Satna, Sidhi district, Rampur Naikin police station, Madhya Pradesh, Politics, crime

At least 42 people died while several others remained missing after a bus fell off a bridge into a canal in Madhya Pradesh's Sidhi district on Tuesday morning. The incident took place under Rampur Naikin police station at around 8.30am.

బస్సు ప్రమాదం: 45 మృతదేహాల వెలికితీత.. గాలింపు ముమ్మరం

Posted: 02/16/2021 06:34 PM IST
Sidhi bus accident 45 bodies found several still missing in madhya pradesh s sidhi

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు జిల్లా అధికారులు. భారీ క్రేన్ల సాయంతో కాలువలో పడిన బస్సును మూడు గంటల పాటు శ్రమించి తీసిన అధికారులు బస్సులో కొన్ని మృతదేహాలను కూడా వున్నట్లు గుర్తించారు. ఇక రంగంలోకి దిగిన గజఈతగాళ్లుతో పాటు ఎన్డీఆర్ఎష్ బృందాలు ఘటనాస్థంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఏకంగా 45 మృతదేహాలను వెలికి తీసిన సిబ్బంది.. మరకొందరు కూడా గల్లంతయ్యారన్న వార్తలు నేపథ్యంలో కాలువలో గాలిస్తున్నారు.

బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 42మంది జలసమాధి అయ్యారు. వీరిలో 24 మంది పురుషులు, 20మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇవాఠ ఉదయం 8.30గంటల సమయంలో సిధి జిల్లాలోని పట్నా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొలుత 18మంది మృతిచెందినట్టు వార్తలు వచ్చినప్పటికీ సహాయక చర్యల్లో మరిన్ని మృతదేహాలను గుర్తించారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో ఇంకొందరు గల్లంతయ్యారు.

ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. దీనిపై రేవా డివిజినల్ కమిషనర్‌ రాజేశ్‌ జైన్‌ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని చెప్పారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ లో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

దుర్ఘటన నేపథ్యంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. ఇద్దరు మంత్రులు ఘటనా స్థలం వద్దకు పంపి సహాయక చర్యలను పరిశీలించాలని అదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కేంద్రప్రభుత్వం తరపున రూ.2లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. భాదిత కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bus  passengers  canal  Satna  Sidhi district  Rampur Naikin police station  Madhya Pradesh  Politics  crime  

Other Articles