‘Vasantha Panchami’ draws hundreds to Basar ‘వసంత పంచమి’ సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తజనం

Devotees throng to basara saraswati temple on vasantha panchami

devotees throng basara temple, devotees mass aksharabhyasam, aksharabhyasam children, Vasantha Panchami, Godess Saraswathi Matha, Grand Celebration, Basara Temple, Indrakaran Reddy, Mass Aksharabhyasam, Nirmal, Telangana

Vasantha Panchami, birthday of the goddess of learning, was celebrated with religious fervour and gaiety on the premises of Sri Gnana Saraswati Devasthanam in Basar on Tuesday. Minister Allola Indrakaran Reddy presented silk cloth to the goddess on behalf of the State government.

‘వసంత పంచమి’ సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తజనం

Posted: 02/16/2021 01:25 PM IST
Devotees throng to basara saraswati temple on vasantha panchami

‘వసంత పంచమి’ చదవులు తల్లి సరస్వతీ దేవి మాత జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని మందిరాలు భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతీదేవి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గోదావరి తీరాన పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు అమ్మవారి చెంత సామూహిక అక్షరాభ్యాసాల కోసం బారులు తీరారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలు ఓవైపు సాగుతుండగా, మరోవైపు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు సమర్పిస్తున్నారు.

సరస్వతీ అమ్మవారి కటాక్షం తమపై వుండాలని కోరుతూ అమ్మవారిని దర్శించుకుని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‍ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి, ముథోల్‍ ఎమ్మెల్యే విఠల్‍రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‍ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles