Kolkata Couple Designs Menu Like an Aadhaar Card పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జబర్థస్త్ నటి తన్మయ్..

Kolkata couple designs wedding s food menu like an aadhaar card

Jabardasth Artist Tanmay, Jabardasth Lady getup Tanmay, Jabardasth Artist Tanmay drunk and drive, Jabardasth Artist Tanmay jubiliee hills police, Tanmai, Jabardasth show, drunk and drike case, jubiliee hills, Hyderabad Police, Telangana, Crime

Jabardasth lady getup comedian Tanmay was caught for drunk driving at Jubilee Hills in Hyderabad on Friday night. Apart from Tanmay, eight event organisers in other cars have also been caught in drunk and drive tests.

ITEMVIDEOS: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జబర్థస్త్ నటి తన్మయ్..

Posted: 02/06/2021 10:38 AM IST
Kolkata couple designs wedding s food menu like an aadhaar card

వీకెండ్ వచ్చిందంటే చాలు.. వాహనదారులు రెండు రోజుల సెలవులను శుక్రవారం సాయంత్రం మద్యం పార్టీతోనే ప్రారంభిస్తారు. పాశ్చాత్య సంస్కృతి అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిట్టిపోసే వారు కూడా.. శుక్రవారం సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ముందు పెనం ముందు వేసిన ఐస్ ముక్కలా జావగారిపోతారు. ఇక ఈ సంస్కృతిని ప్రభుత్వాలే పోంచిపోషిస్తున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయం కావాలంటే.. ప్రతీ పౌరుడు మద్యం తాగాల్సిందేనని కూడా భవిష్యత్తులో చట్టాలను తీసుకువచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

దీంతో ఈ మందుబాబులతో పోలీసులకు పని ఎక్కువవుతోంది. కరోనాకు ముందు వరకు నగరంలో ప్రజలు గాడిన పడ్డారని సంబరపడిన పోలీసులు.. ఇక ఇప్పుడు మళ్లీ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదిని మళ్లీ  డ్రంక్ అండ్ డ్రవ్ చెక్ లకు సిద్దమయ్యారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని గత కొన్నేళ్లుగా వాహనదారుల చెవుల్లో గూడు కట్టుకుని మరీ చెబుతున్నా.. కరోనాకు ముందు కాసింత పరిస్థితిలో మార్పు వచ్చినా..  అడపాదడపా మందుబాబులు అడ్డంగా దోరికేవారు. కానీ కరోనా తరువాత మళ్లీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీంతో పోలీసులు చెక్ పాయింట్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు.

ఇలా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తనీఖీ చేస్తున్న పోలీసులకు జబర్థస్త్ లేడీ గెటప్ నటి తన్మయ్ అడ్డంగా దొరికిపోయింది. అమెతో పాటు మరో కారులోనూ వచ్చిన ఈవెంట్ అర్గనైజర్స్ ఎనమిది మంది పోలీసులకు చిక్కిపోయారు. అయితే డ్రైవింగ్ సీటులో వున్న వారిని పోలీసులు అల్కహాట్ టెస్టు నిర్వహించగా వారు తాగివున్నారని నిర్థారించారు. ఇలా మద్యం సేవించి కారును నడుపుకుంటూ వచ్చిన అర్టిస్టులలో తన్మయ్ కూడా వున్నారు. దీంతో పోలీసులను కాసింత సేపు అమె బతిమాలినా.. వారిపై కేసు నమోదు చేయకుండా పోలీసులు వదిలిపెట్టడం సాధ్యం కాదని చెప్పారు.

ఇదిలావుండగా అదే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద మరో వాహనంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కొందరు యువతులు పట్టుబడ్డారు. వారు తాము రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ అలి బంధువులమని.. తమకో పెట్టుకోవద్దని పోలీసులనే హెచ్చరించారు. అయినా పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇక శుక్రవారం రాత్రి . వెస్ట్ జోన్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 5 కార్లు , 2 ఆటోలు, 12 బైక్‌లను పోలీసులు పట్టుకున్నారు. ఇక శని, ఆదివారాల్లో మరెందరు పట్టుబడతారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles