UFO spotted by Pakistani pilot in Punjab province గగనతలంలో మెరిసే భింభం.. చిత్రీకరించిన పాక్ పైలెట్..

Pilot spots very shiny ufo over pakistan says could be space station artificial planet

UFO, UFO VIDEO, UFO SPOTTED IN KARACHI, KARACHI PIA PILOT, PIA PILOT SPOTTED A UFO IN KARACHI, KARACHI, UFO VIDEO BY PIA PILOT, PIA Pilot Make UFO Video In Karachi, UFO Footage, PIA Pilot UFO Video, UFO In Karachi, Pakistan

A Pakistani pilot has claimed that he spotted a very shiny, unidentified flying object (UFO) in the sky during a domestic flight. According to sources, the Pakistan International Airlines' pilot saw the UFO near Rahim Yar Khan while operating a regular flight (Airbus A-320) to Lahore from Karachi. He captured a video of the UFO.

ITEMVIDEOS: గగనతలంలో మెరిసే భింభం.. చిత్రీకరించిన పాక్ పైలెట్..

Posted: 01/28/2021 12:25 PM IST
Pilot spots very shiny ufo over pakistan says could be space station artificial planet

ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై మనుషులు నివసించే పరిస్థితులు వున్నాయా.? అన్న అంశంపై స్పష్టత కోసం ఇప్పటికే చంద్రుడిపైకి వెళ్లి వచ్చారు. ఇలా ఇతర గ్రహాలపైకి కూడా వెళ్లేందుకు చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ముందుగా మన ఉపగ్రహాలను ఆయా గ్రహాలపైకి పంపించి అక్కడి వాతావరణ పరిస్థితులు, నీరు ఇతర అంశాలపై అధ్యయానాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో గ్రహాంతరవాసులు కూడా భూగ్రహంపైకి వస్తారా.? వారు ఇక్కడికి వచ్చి అధ్యయనాలను చేస్తున్నారా.? అన్న ప్రశ్నలు ఇప్పటికే పలుమార్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే భూగగనతలంలో గుర్తు తెలియని వస్తువులు (యూఎఫ్ఓ) సంచరిస్తున్నాయన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. వీటిలో గ్రహాంతరవాసులు భూమిపైకి చేరుకుంటున్నారని వాదనలు కూడా లేకపోలేవు. అయితే గ్రహాంతరవాసులు వస్తున్నట్లు, లేక వారే పరిశోధనలు జరుపుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో గ్రహాంతరవాసులు అంశం మానవాళికి మిస్టరీగానే ఉంది. వీరికి సంబంధించిన విషయాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. కాగా తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ విమాన పైలెట్ ఆకాశంలో యూఎఫ్ఓను గుర్తించడంతో పాటు దానిని తన సెల్ పోన్ లోనూ బంధించాడు.

పాకిస్థాన్ గగనతలంలోంచి ఈ నెల 23న లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న విమాన పైలెట్.. మార్గమధ్యంలో రహీమ్ యార్ ఖాన్ ప్రాంతంలో వెలిగిపోతున్న ఓ మెరుస్తున్న భింభాన్ని గుర్తించాడు. నీలి ఆకాశంలో కాంతివంతంగా కనిపించిన వస్తువు పైలట్ కంటి దృష్టిని ఆకర్షించింది. దీంతో దానిని ఆయన తన సెల్ ఫోన్ లో బంధించాడు. దీనిపై కంట్రోల్ రూమ్ కు కూడా సమాచారం అందించాడు. విమానం దిగినంతనే తన ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చి.. వీడియోలు చూపాడు. ఇక బయటకు వచ్చిన తరువాత ఈ మెరుస్తున్న తెల్లని భింభం పాకిస్తాన్ లోని చాలా మందికి కనిపించిందని.. పలు ప్రాంతాల్లోని ప్రజలు కూడా దానిని వీడియోలు తీసారు.  అయితే, ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కానీ, లేక మరేదైనా భారీ ఉపగ్రహం కానీ అయ్యుండొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PIA UFO  UFO VIDEO  KARACHI PIA  UFO  PIA PILOT UFO  Karachi  Pakistan  

Other Articles