Abhishek Banerjee dares BJP over dynastic politics వారసత్వ రాజకీయాలపై బీజేపి టీఎంసీ ఎంపీ సూటిప్రశ్న.?

Abhishek banerjee dares bjp bring this law i promise i ll quit

Abhishek Banerjee dares BJP over dynasty politics, Abhishek Banerjee challenges BJP over dynasty politics, TMC, Abhishek Banerjee, Mamata Banerjee, BJP, Mukul roy, Rajnath Singh, dynasty politics, bill over dynasty politics in parliament, new bill on dynasty politics, diamond harbour, suvendu adhikari, official programe, West Bengal, Politics

Trinamool Youth Congress president and West Bengal chief minister Mamata Banerjee’s nephew Abhishek Banerjee took jabs at top Bharatiya Janata Party (BJP) leaders, including Union defence minister Rajnath Singh, on the issue of dynastic politics at an election rally in his Lok Sabha constituency.

‘‘దమ్ముంటే.. వారసత్వ రాజకీయాలపై బిల్లు తీసుకురండీ’’ టీఎంసీ ఎంపీ

Posted: 01/25/2021 04:50 PM IST
Abhishek banerjee dares bjp bring this law i promise i ll quit

వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త మమతా బెనర్జీని కూడా టార్గెట్ చేస్తూ బీజేపి నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికోట్టారు. వారసత్వ రాజకీయాలపై ఇతర పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్న బీజేపి నేతలు తాము గురువింద గింజలమే అన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు ఇతర పార్టీలను వారసత్వ రాజకీయాలపై ప్రశ్నిస్తూనే మరోవైపు తమ పార్టీలో వున్న అదే వరుసను ఎలా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు,

బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవార్గీయ నుంచి అనేక మంది వారసులు, సోదరులు అదే పార్టీలో ఇతర పదవులలో కొనసాగుతున్నారని, వారివి వారసత్వ రాజకీయాలు కావా.? అంటూ ఆయన ప్రశ్నించారు. విజయవార్గీయ తనయుడు మధ్యప్రధేశ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడితో పాటు బీజేపి నేత ముఖుల్ రాయ్ తనయుడు కూడా ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఇక సువేందు అధికారి తండ్రి పెద్దన్న ఇద్దరూ లోక్ సభ సభ్యులని, ఆయన తమ్ముడు స్థానిక సంస్థలో పదవిని అలకరించాడని.. వీళ్లు వారసత్వంగా పదవులను అలకరించి.. తమ తప్పులెరగరన్నట్లు తమను ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు.

తన పార్లమెంటు నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోని కుతాలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మరో అడుగు ముందుకేసీ.. కేంద్రంలో పూర్తి అధికారంలో వున్న బీజేపి ప్రభుత్వం.. దమ్ముంటే వెంటనే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా.. కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఎన్నికలలో పోటీ చేసేలా నూతన చట్టాన్ని తీసుకురావాలని ఆయన సవాల్ చేశారు, ఇలా బిల్లును తీసుకువచ్చిన వెంటనే తాను రాజకీయాల నుంచి 24 గంటల వ్యవధిలో తప్పుకుంటానని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే తమ కుటుంబం నుంచి రాజకీయాలలో పాల్గోంటారని ఆయన తేల్చిచెప్పారు.

కాగా అభిషేక్ బెనర్జీ బీజేపిపై చేసిన వ్యాఖ్యలకు బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి తోసిపుచ్చారు. రాష్ట్రంలో అలుముకున్న సమస్యలను ప్రజల దృష్టి నుంచి మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అరోపించారు. ప్రముఖంగా నిరుద్యోగం, పారిశ్రామికంగా వెనుకబాటు.. రాష్ట్ర ప్రగతి, శాంతిభద్రతల సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ప్రసంగాలను టీఎంసీ నేతలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్ నాథ్, విజయవార్గీయ తనయులు రాజకీయాలలో కొనసాగవద్దని ఎవరు అంటారని ఆయన ప్రశ్నించారు. ఇక బెంగాల్ బీజేపి నేతలు టీఎంసీలో వున్న సందర్భంలోనే వారికి పదవులు వున్నాయని, అప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడిలా విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నారని నిలదీశారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TMC  Abhishek Banerjee  Mamata Banerjee  BJP  Mukul roy  Rajnath Singh  dynasty politics  West Bengal  Politics  

Other Articles