TRS ready to fight nagarjuna sagar by-poll నాగార్జున సాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ సన్నధం..

Trs ready to fight nagarjuna sagar by poll kcr to kick start campaign

CM KCR Election Campaign, Cm Kcr Public Meeting, Nagarjuna Sagar Election campaign meeting, CM KCR, Nagarjuna sagar, By Elections, by polls, Nomula Narsimhaiah, Jana Reddy, Congress, TRS, Nalgonda, Telangana, Politics

TRS party gets ready to fight nagarjuna sagar by-poll after a setback in Dubbaka by elections and GHMC Elections. Now CM KCR takes Nagarjuna Sagar by elections as his task and ready to kick start election campaign in the last week of the month.

నాగార్జున సాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ సన్నధం.. సీఎం కేసీఆర్ సమరశంఖః

Posted: 01/19/2021 08:42 PM IST
Trs ready to fight nagarjuna sagar by poll kcr to kick start campaign

(Image source from: Twitter.com/TelanganaCMO)

నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. దుబ్బాక ఉపఎన్నికతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఎదురైన గుణపాఠాలను ఎదురుదెబ్బలను మరోమారు పునారావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థి పార్టీలతో పోటీ నేపథ్యంలో వారిని ధీటుగా ఎదుర్కోనేందకు పకడ్భంధీ ప్రణాళిక, వ్యూహ ప్రతివ్యూహా కార్యచరణకు కూడా సిద్దమవుతోంది.

దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీలలో చావు తప్పి కన్ను లోట్టపోయిన చందంగా మారిన నేపథ్యంలో అధికార పార్టీ మార్కును మళ్లీ ప్రజల్లో ముద్రవేయించుకోవాలన్న టీఆర్ఎస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ రెండు ఎన్నికలలో ఎదురైన పరాభవాలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో సమాధానం చెప్పాలని రెడీ అవుతోంది. ఇందుకోసం నాగార్జున సాగర్ ఉపఎన్నికపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇక పార్టీ అధిష్టానం కూడా ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఉప ఎన్నికలకు తమ ప్రచారం లేకుండానే గెలుపు సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా తన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లు సమాచారం,

ఇకపై రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ విజయమే పరమావధిగా పనిచేయాలని, అందుకు అనుగూణంగా ప్రచార బాధ్యతలను కూడా చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో తాను ప్రచారం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ నెల 22-24 తేదీల మధ్య భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. కేసీఆర్ సభకు లక్షన్నర మందిని సమీకరించి.. సభ సక్సెస్ కావడంతోనే ఉప ఎన్నికలో గెలుపు టాక్ సొంతమయ్యేలా చేయాలని నిర్ణయించాయి.

ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి.. కేటీఆర్ ను కలిసి సభ విషయమై చర్చించారు. ఇదివరకే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించి.. నాగార్జున సాగర్ బహిరంగ సభ నిర్వహణ, జన సమీకరణ అంశాలను చర్చించినట్టు సమాచారం. సభను ఘనంగా నిర్వహించి ప్రత్యర్థి పార్టీలల్లో అందోళన రేపాలన్నదే లక్ష్యమన్నట్లు సమాచారం. అందుకు ఆయన పలు సూచనలు కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమ భరత్‌కుమార్ గుప్తా తదితరుల నేతృత్వంలోని కమిటీకి అప్పగించినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Nagarjuna sagar  By Elections  by polls  Nomula Narsimhaiah  Jana Reddy  Congress  TRS  Nalgonda  Telangana  Politics  

Other Articles