Mystery illness makes sixteen villagers sick in Bhimadole బీమడోలులో వింతవ్యాధి కలకలం.. సృహకోల్పుతున్న జనం..

16 admitted to west godavari district hospital with eluru type symptoms

health centre at Bhimadole in West Godavari,Eluru type symptoms in Godavari hospital,Eluru in West Godavari,Eluru in Andhra Pradesh,16 admitted to West Godavari district hospital, Illness, sick, villagers, hospital, mystery, pulla village, bhimadole PHC, Bhimadole, west godavari, Crime

Sixteen villagers collapsed suddenly due to a mysterious illness in Pulla and the neighbouring villages in Bhimadole mandal in West Godavari district in the last two days. Some persons are undergoing treatment in private hospitals. According to sources, the persons suffered from epilepsy, vomiting and convulsions. They were admitted to different hospitals and their condition is stated to be stable.

బీమడోలులో వింతవ్యాధి కలకలం.. సృహకోల్పుతున్న జనం..

Posted: 01/19/2021 08:26 PM IST
16 admitted to west godavari district hospital with eluru type symptoms

కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వారిని మహమ్మారి కబళించివేస్తుందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంతో పాటు ఏపీలోనూ కరోనా కేసులు, మరణాలు అధికంగానే నమోదయ్యాయి, ఇక అరోగ్యం విషయంలో అటు వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు ఇటు ప్రజలంతా అప్రమత్తంగా వున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లాలను మాత్రం వింతవ్యాధులు అతలాకుతలం చేస్తున్నాయి,

జిల్లాలోని ఏలూరులో వింత వ్యాధితో దాదాపు 600 మందిని ప్రభావితం చేసి.. పలువురిని కబళించింది. గత ఏడాది డిసెంబర్ 5న వెలుగుచూసిన వింత వ్యాధి ఘటన పరిసర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. అప్పట్లో ఈ వ్యాధి కారణంగా పలువురు ప్రజలు సృహకోల్పోయి వాంతులు, విరోచనాలు, కడుపు నోప్పి కారణంగా అసుపత్రుల పాలయ్యారు. దాని నుంచి మెల్లిగా కోలుకున్న జిల్లా వాసులను మరో అదే తరహా వింత వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. భీమడోలు మండలంలోని పుల్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని ప్రజలు అకస్మాత్తుగా సృహకోల్పోతున్నారు. ఏలూరులో వెలుగుచూసిన తరహా వ్యాధి లక్షణాలతోనే స్థానికులు అసుపత్రుల పాలవుతున్నారు. మండలంలోని పుల్లా సహా పలు గ్రామాలలో ఒక మర్మమైన అనారోగ్యం కారణంగా పదహారు మంది గ్రామస్తులు అకస్మాత్తుగా సృహకోల్పోయారు.

పుల్ల గ్రామంలో వింతవ్యాధి బారిన ప్రజలు పడుతున్నారన్న సమాచారంతో వైద్యశాఖ అధికారులు ఆయా ప్రాంతాలలో అలర్ట్ చేశారు, గ్రామంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. బాధితులను స్థానిక ప్రైవేటు అసుపత్రులతో పాటు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికత్స అందిస్తున్నారు, అయితే చికిత్స అందుతున్న పదహారు మంది పరిస్థితి నిలకడగా ఉందని వైద్యఅరోగ్య అధికారులు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య, రెవెన్యూ అధికారులు పుల్లా గ్రామానికి చేరుకుని రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కలుషిత ఆహారం, నీరు కారణంగానే అనారోగ్య పరిస్థితులు తలెత్తాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mysterious illness  Illness  sick  villagers  hospital  mystery  pulla village  bhimadole PHC  Bhimadole  west godavari  Crime  

Other Articles