BJP MP misses court appearance by admitting in AIIMS మాలేగావ్ కేసులో కొర్టుకు బీజేపి ఎంపీ గైర్హాజరు..

Malegaon blast case accused mp pragya thakur admitted to aiims to miss court appearance

BJP MP Pragya Thakur, Pragya Singh Thakur misses court appearance, Advocate JP Mishra, 2008 Malegaon blast case, motorcycle bomb blast case, special NIA court Malegaon blast, admitted to AIIMS Delhi, Eye Operation, Mumbai, Maharashtra, Politics, Crime

BJP Lok Sabha MP from Bhopal in Madhya Pradesh, Pragya Singh Thakur will not be able to attend court this weekend citing health conditions. Thakur is an accused in the 2008 Malegaon blast case. Pragya Singh Thakur and the other accused in the 2008 Malegaon blast case had been ordered to be physically present during the hearings by the trial court.

మాలేగావ్ కేసులో కొర్టుకు బీజేపి ఎంపీ గైర్హాజరు.. ఎయిమ్స్ లో చేరిక..

Posted: 12/19/2020 06:12 PM IST
Malegaon blast case accused mp pragya thakur admitted to aiims to miss court appearance

(Image source from: Timesofindia.indiatimes.com)

ఆరుగురి మరణంతో పాటు వందలాది మంది క్షతగాత్రులయ్యేందుకు కారణమైన 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణకు సినీపక్కీలో డుమ్మా కొట్టారు. సినిమాల్లో న్యాయస్థానం హాజరు నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రులలో చేరి నాటకమాడినట్టుగానే.. బీజేపి ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కూడా మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్ల కేసు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రిలో చేరారని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘకాలంగా విచారణ వాయిదా పడిన ఈ కేసును ఈ నెల ఆరంభంలో ఎన్ఐఏ న్యాయస్థానం విచారణను ప్రారంభించింది.

గతంలో వున్న న్యాయమూర్తి బదిలీ కాగా, ఈ కేసులో జస్టిస్ పీఆర్ సింట్రే ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు, ఈ నేపథ్యంలో ఈ నెల ఆరంగంలోనే ఈ కేసులో నిందితులైన ఏడుగురు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ తాజా విచారణకు ముగ్గురు మినహా ప్రగ్యాసింగ్, రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ ద్వివేదీ, సుధాకర్ చతుర్వేదిలు హాజరు కాలేదు. కరోనా నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతోనే వీరు రాలేకపోయారని వారి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణణ ఇవాళ్టికి వాయిదా వేసింది, ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం ఇవాళ సమన్లు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది.

కాగా, ఆరోగ్య పరీక్షల కోసం ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రగ్యాసింగ్‌ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. విచారణకు హాజరుకావడానికి ప్రగ్యాసింగ్ ముంబైకి రావాలని అనుకున్నారని, రెండు రోజులపాటు ఇక్కడే ఉండాలని అనుకున్నారని, అయితే, రెగ్యులర్ చెకప్ కోసం ఎయిమ్స్‌కు వెళ్లిన ఆమె వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరారని ఆమె తరపు న్యాయవాది జేపీ మిశ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఆమె ఎలాంటి చికిత్స తీసుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, 29 సెప్టెంబరు 2008న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సుమారు 270 కిలోమీటర్ల దూరంలోని మాలేగావ్‌లో మసీదు సమీపంలో ఓ మోటారు సైకిల్ కు బిగించిన బాంబు పేలుళ్లలో ఆరుగురు చనిపోగా, 100 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles