Farmers protests at Delhi's borders continue for 16th day 16వ రోజు కొనసాగుతున్న రైతు నిరసన దీక్షలు

Farmers protests at delhi s borders continue for 16th day

India, Farmers, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, political parties, Politics

Adamant on their demand of repealing the three farm laws, farmer groups on Friday continued their agitation on Delhi's interstate borders for the 16th day in a row. The leaders of the farmers' groups asserted that in case the entral government brought forth fresh positive proposals, they would resume parleys.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతు నిరసన దీక్షలు..

Posted: 12/11/2020 10:31 AM IST
Farmers protests at delhi s borders continue for 16th day

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గత పదహారు రోజులుగా ఢిల్లీలోని శివారు సింఘు ప్రాంతంలో నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ బిల్లులపై అటు కేంద్రం ఇటు రైతులు పట్టువీడకపోవడంతో ఇరువర్గాలకు మద్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే వుంది. భారత్ బంద్ కు పిలుపునిచ్చి జయప్రదం చేసిన రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతు సంఘాల నేతలతో భేటీ తరువాత తమకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయని రైతు సంఘాలు భావించారు. అయితే ప్రతిపాదనలను పంపుతామన్న కేంద్రమంత్రి మంత్రి హామీతో వెళ్లిన రైతు సంఘాలు కేంద్రం తాజాగా పంపిన ప్రతిపాదనలు కూడా తమకు అనుకూలంగా లేవని వాటిని వ్యతిరేకించారు.

దీంతో నూతన వ్యవసాయ బిల్లులను భేషరుతుగా కేంద్రం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు, ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన రైతు సంఘాలు కేంద్రంలోని బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రాష్ట్రాలు, జిల్లా బీజేపి కార్యాలయాల ముట్టడికి కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అటు బీజేపి కూడా తాము తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు రైతులకు ఏ విధంగానూ వ్యతిరేకం కాదన్న విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసీన పలువురు రైతులు, రైతు మద్దతు దారులు కేంద్రం తీసుకువచ్చిన బిల్లలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.

దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అప్పగించి.. రైతును తన పోలంలో తననే కూలీగా మార్చే చట్టాలను కేంద్రం ఎలా ప్రోత్సహిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు పండించే పంటపై రైతుకు అధికారం లేకుండా ప్రతి గింజకు, ప్రతీ కాయకు కార్పోరేట్ లెక్కలు కడుతోందని, దిగుబడి, నాణ్యతపై అధారపడే వారు పంట ఉత్సత్తులకు ధర నిర్ణయిస్తారని అరోపిస్తున్నారు. ఇక కార్పోరేట్  సంస్థలు వ్యవసాయ దిగుబడులపై చూపించే ఉత్సాహం.. భూమిసారంపై చూపరని, రసాయనాలు, ఇతరాత్రాలతో పంట దిగుబడి పెంచేలా చేసే ప్రక్రియలో భూమి తన సారవంతాన్ని కోల్పోతుందని, ఆ భూమిని తాము ఏం చేసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం తాము తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles