Amit Shah meets farmers amid protests over farm laws భారత్ బంద్ తో దిగివచ్చిన కేంద్రం.. చర్చలకు ఆహ్వానం..

Farmers agitation delegation amit shah meet begins at indian council of agricultural research

Bharat Bandh, farmers Bharat Bandh, Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, Bharatiya Kisan Union, delegation of farmer leaders, Union Home Minister Amit Shah, Amit Shah farmer meeting, All India Kisan Sabha

A 13-member delegation of farmer leaders which is set to meet Union Home Minister Amit Shah said it will seek a 'yes' or 'no' answer from the central government. The govt will send a proposal tomorrow on the AMPC Act but has refused to withdraw all three farm laws. In addition, the Centre has also proposed written assurances on amendments and MSP.

భారత్ బంద్ తో దిగివచ్చిన కేంద్రం.. చర్చలకు ఆహ్వానం..

Posted: 12/09/2020 12:28 PM IST
Farmers agitation delegation amit shah meet begins at indian council of agricultural research

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా పలు రాష్ట్రాల్లో సంపూర్ణంగా, పలు రాష్ట్రాల్లో పాక్షికంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక సెగ రాజుకోవడంతో కేంద్రం దిగివచ్చింది. కేంద్రంతో ఇదివరకే ఐదు పర్యాయాలు చర్చలు జరిపినా.. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే విషయంలో వెనక్కు తగ్గని కేంద్రం.. రేపు అనగా డిసెంబర్ 9న మరోమారు చర్చలు జరపనుంది. రేపటి చర్చల నేపథ్యంలో తమ ప్రభావం ఎలాంటిదో కేంద్రంలోని పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు రైతుసంఘాలు భారత్ బంద్ నిర్వహించాయి.

అయితే హస్తిన శివార్లలోని సింఘం ప్రాంతంలో గూడారాలు వేసుకుని గత 13 రోజులుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తున్నా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందే తప్ప.. చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని అరోపిస్తున్న రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. రైతులతో ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ కార్యాలయంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు నిర్వహించారు. అయితే ఈ చర్చల్లోనూ వ్వయసాయ బిల్లులను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా.? లేదా.? అన్న అంశమే ప్రధానాంశంగా తీసుకుని చర్చిస్తామన్న రైతుసంఘాల నేతలు తెలిపారు.

కాగా అమిత్ షాతో చర్చల అనంతరం కూడా ఈ విషయంలో ఇంకా ఏమీ తేల్చకుండానే చర్చలు అర్థంతరంగా ముగిసినట్టు తెలుస్తోంది. రైతు సంఘాలతో చర్చల అనంతరం రేపు కేంద్రప్రభుత్వం వ్యవసాయ బిల్లులపై ఓ ప్రతిపాదనను పంపుతామని తెలిపినట్లు సమాచారం. అయితే కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ భిల్లులను వెనక్కు తీసుకోవడంలో మాత్రం కేంద్రం ససేమిరా అన్నట్లు తెలిసింది. కాగా, ఇదే సమయంలో రైతు సంఘాలు తీవ్రంగా అందోళన చెందుతున్న నేపథ్యంలో నూతనంగా వ్యవసాయ బిల్లులో తీసుకువచ్చిన సవరణలతో పాటు గిట్టుబాటు ధరలపై కూడా లిఖితపూర్వక హామీలను ఇచ్చేందుకు సమ్మతించినట్లు సమాచారం.

ఇవాళ రాత్రి 7.45 నిమిషాలకు రైతు సంఘాలకు చెందిన నాయకులను ఇండియన్ కౌన్సిల్ అప్ అగ్రికల్చర్ రిసర్చ్ అంతర్జాతీయ అతిధిగృహంలోకి అధికారులు తీసుకెళ్లారు. కాగా 7.45 నుంచి సుమారు గంట 15 నిమిషాల తరువాత అంటే రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి, అయితే రైతు సంఘం నాయకుడు రుల్డు సింగ్ మాన్సా, బోధ్ సింగ్ మాన్సాలు మాత్రం సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. అందుకు కారణం రైతు సంఘాల నేతలకు మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అధికారులతో జరుగుతున్న చర్చలు ఎక్కడ నిర్వహిస్తున్నారన్న విషయంలోనూ స్పష్టత లేకపోవడమే. దీనిని కూడా కేంద్రం ప్రదర్శించిన లౌక్యమేనని రైతు సంఘాలు అరోపిస్తున్నాయి. ఇక రేపు ఎలాంటి ప్రతిపాదన వస్తుందన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles