గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపి నగరంలోని అత్యధిక డివిజన్లలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా లేదన్న విషయం స్పష్టంగా వెల్లడైంది. తెలంగాణ సర్కారుపై ఉద్యోగి కన్నెర్ర చేశాడన్న విషయం గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోనూ తేలింది. కాగా, ఈ సారి ఉద్యోగులు రమారమి ఎన్నికలపై నిర్లిప్తత ప్రదర్శించారని కూడా తేలింది. ఈ సారి ఏకంగా 27 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో హాజరవుతుండగా, వారిలో కేవలం 2000 లోపు ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ హక్కును వినియోగించుకున్నారని సమాచారం. నగర బల్దియా పీఠంపై మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందనే భావనతోనే వారు ఈ మేర నిర్లప్తత ప్రదర్శించినట్టు తెలుస్తోంది.
ఇక రాజధాని నగరంలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ఉద్యోగులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేసారు. ప్రస్తుతతం అందుబాటులో వున్న సమాచారం మేరకు నగరంలోని మొత్తం అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ 31 స్థానాల్లో, ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎంఐఎంకు గట్టి పట్టున్న పాతబస్తీలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో పలు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఫలితాల సరళిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఫలితాలపై స్పందించిన టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగులకు తాము కొంత దూరాన్ని పాటిస్తున్నామన్న విషయాన్ని అంగీకరిస్తూ.. ఇకపై వారిని కూడా కలుపుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
కాగా ఈ ఫలితాలపై బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఇదే ఫలితాలు రాత్రి వరకు కోనసాగుతాయని, బల్దియా పీఠంపై బీజేపి జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో మూలాలను జీహెచ్ఎంసీ ఎన్నికలతో బలపర్చుకున్నామని అన్నారు. ఇకపై జరగనున్న ప్రతీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించి ప్రధాని నరేంద్రమోడీకి కానుకగా అందించేందుకు ప్రతీ బీజేపి కార్యకర్తలో ఉత్సాహాం రెట్టింపు అవుతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలతో తెలంగాణ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని, అయితే పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత స్పష్టమైన సందేశం వస్తుందని అరవింద్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more