Moderna Vs Pfizer: When Will The Vaccines Be Ready? మా వ్యాక్సిన్ 95 శాతానికి పైగా సత్ఫలితాలిస్తోంది: మోడెర్నా

Moderna covid 19 vaccine found 94 5 effective at preventing coronavirus

Moderna, Mogderna covid vaccine, Pfizer's covid vaccine, Joe Biden, Donald Trump, coronavirus, corona vaccine update, coronavirus vaccine news, corona vaccine latest update, COVID-19 symptoms, coronavirus symptoms, coronavirus cure, COVID-19 treatment, COVID-19 cure, COVID-19 latest update, COVID-19 latest news

For the second time this month, a more positive news comes from another Covid vaccine candidate. Moderna Inc today announced that the independent NIH-appointed Data Safety Monitoring Board (DSMB) for the Phase 3 study of mRNA-1273, its vaccine candidate against COVID-19, has shown that the company's experimental vaccine is 94.5% effective in preventing novel coronavirus.

మా వ్యాక్సిన్ 95 శాతానికి పైగా సత్ఫలితాలిస్తోంది: మోడెర్నా

Posted: 11/17/2020 02:41 PM IST
Moderna covid 19 vaccine found 94 5 effective at preventing coronavirus

జర్మనీకి చెందిన తమ భాగస్వామి బయో ఎన్ టెక్ ఎస్ఈతో కలిసి తయారుచేసిన వ్యాక్సిన్ 90 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించిన తరువాత దాని మూడోవ దశలో విపరీతంగా హ్యాంగ్ ఓవర్ ఉందని తేలిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాము అభివృద్ది చేస్తున్న కరోనా వాక్సీన్ 94.5శాతం ప్రభావం చూపుతున్నట్లుగా తేలిందని యూఎస్ కు చెందిన ఫార్మాస్యూటికల్స్ సంస్థ మోడార్నా ప్రకటించింది, కరోనాను అంతం చేసే విషయంలో తాము ఎంఆర్ఎన్ఏ-1273 పేరిట అభివృద్ది చేసిన టీకా బాగా పనిచేస్తోందని ట్రయల్స్ లో వెల్లడైందని పేర్కోంది. అయితే పైజర్ టీకా కన్న అత్యున్నతంగా మోడెర్నా టీకా పనిచేస్తుందన్న సమాచారంతో అగ్రరాజ్యంలో ముందుగా ఈ టీకాను వినియోగించేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కోరాన వాక్సీన్ ను నియంత్రించే దిశగా.. తమ వాక్సీన్ 94.5 శాతం మేర పనిచేస్తున్నందున.. ఇదో కీలకమైన ముందడుగని మోడెర్నా అభిప్రాయపడింది, ఇక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ హెల్త్ ఆధ్వర్యంలోని డేటా సెఫ్టీ మానిటరింగ్ బోర్డు సైతం మోడెర్నా తయారు చేసిన వాక్సీన్ 94.5 శాతం మేర పనిచేస్తోందని దృవీకరించింది. ఈ మేరకు మోడెర్నా ఓక ప్రకటనను విడుదల చేసింది. ఈ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తమ టీకా వినియోగానికి వీలుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఎమర్జెన్సీ హెల్త్ ఆథరైజేషన్ (ఈయూఏ) నుంచి అనుమతులు కోరనున్నామని కూడా మోడెర్నా వెల్లడించింది, అదే సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాలకు తమ టీకాను పంపించేందుకు ఫార్మా కంపెనీలతోనూ ఓప్పందాలను కుదుర్చుకునే యోచనలో వున్నామని మోడెర్నా తెలిపింది.

మోడెర్నా తన మూడవ దశ ట్రయల్స్ లో భాగంగా 30 వేల మందికి వాక్సీన్ ఇచ్చి, వారి తొలి రిపోర్టులను పరిశీలించడంతో పాటు వాటిని బహిర్గతం చేసింది. ఈ ఫలితాలు చాలా ఆశాజనకంగా వున్నాయని, తమ వాక్సీన్ కోవిడ్ ను నిరోధించడంతో పాటు మరెన్నో ఇతర వ్యాధులను కూడా రాకుండా పనిచేస్తోందని మోడెర్నా సీఈఓ బ్యాన్సెల్ వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేకంగా ప్రస్తావించిన అమెరికా కాబోయే అధ్యక్షుడు జోబిడెన్.. త్వరలోనే రెండో వాక్సీన్ కూడా అందుబాటులోకి రానుందన్న వార్త ఆనందాన్ని కలిగిస్తోందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కోన్నారు, తొలి వాక్సీన్ సహా రెండో వాక్సీన్ కూడా ప్రభావంతంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు, ఈ వాక్సీన్లు అందుబాటులోకి వచ్చేంత వరకు అమెరికన్లు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్త చర్యలను తీసుకోవాలని, తప్పక మాస్కులు ధరించాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles