British Diplomat Saves Drowning Woman In China నదిలో మునిగిన యువతిని కాపాడిన బ్రిటెన్ అంబాసిడర్..

Watch china rescue british diplomat stephen ellison saves drowning woman

British diplomat, China student, china river, drowninig student, hero diplomat, Stephen Ellison, Chongqing, Zhongshan, Weibo, viral video, China, UK, Crime

A British diplomat has been hailed as a hero after diving into a river in China to save a drowning student. Stephen Ellison, 61, consul-general in Chongqing, was walking by a river in a nearby village when the woman, 24, slipped on rocks into the deep water. Footage filmed by onlookers showed her disappear under a footbridge and emerge face down, apparently unconscious. Mr Ellison took off his shoes and dived in to save her.

ITEMVIDEOS: చైనా నదిలో పడిపోయిన యువతిని కాపాడిన బ్రిటెన్ అంబాసిడర్..

Posted: 11/17/2020 02:17 PM IST
Watch china rescue british diplomat stephen ellison saves drowning woman

చైనాలోని సోషల్ మీడియా దిగ్గజం వైబోలో తాజా విపరీతంగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బ్రిటన్ దౌత్యాధికారిని రియల్ లైఫ్ హీరోగా మార్చివేసింది, సర్వసాధారణంగా కొన్ని విడీయోలు వైరల్ గా మారుతుంటాయి.. కానీ ఈ వీడియోలో చైనాలోనే కొట్ల వ్యూస్ రాబట్టకుని వైరల్ గా మారుతోంది. అంతలా బ్రిటెన్ దౌత్యాధికారిని హీరోను చేసిన ఘటన ఏమిటీ.? ఆయనను ఎందుకు అంతలా ప్రశంసిస్తున్నారు.? అందుకు సంబంధించిన ఘటనను చైనాలోని పలువురితో పాటు చైనా ప్రభుత్వం, బీజింగ్ లో ఉన్న బ్రిటన్ దౌత్య కార్యాలయం, చోంగ్ క్వింగ్ లోని బ్రిటన్ మిషన్ తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాయి. వీడియోను చూసిన ప్రతీ ఒక్కరు కూడా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చైనాలో బ్రిటెన్ కౌన్సిల్ జనరల్ గా పని చేస్తున్న స్టీఫెన్ ఎల్లిసన్ (61).. వారంతపు సెలవులను ఎంజాయ్ చేయడానికి తన కుటుంబంతో పాటుగా వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వేళ, అక్కడికి చైనాలోని ఓ ప్రాంతానికి చెందిన కాలేజీ యువతీ యువకులు కూడా వచ్చారు. వారంతా కూడా ఎవరి పనులలో వారు నిమగ్నమైన వేళ.. ఓ యువతి తన స్నేహితులతో కలిసి నదిలోకి దిగేందుకు ప్రయత్నించింది. అయితే స్నేహితుల కన్నా ముందుగా అమె నది చివరకు వెళ్లింది. అనుకోకుండా అదుపుతప్పి అమె నదలో పడిపోయింది. వెంటనే అమె స్నేహితురాళ్లు అరుపులు, కేకలు వేసి.. అమెను కాపాడండీ అంటున్నారు. ఈ లోగా యువతికి ఈత రానీ కారణంగా ఆమె నీటిలోంచి భయటపడేందుకు కష్టపడుతోంది.

తన కళ్ల ముందు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువతిని రక్షించేందుకు బ్రిటెన్ దౌత్యాధికారి హుటాహుటిన నదిలోకి దూకారు. అప్పటికే నీళ్లను దిగమించిన యువతి అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో అమెను గట్టిగా పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అంతలో ఒక ట్యూబ్ ను కొందరు విసరడంతో అమెను దానిపై వేసి.. ఒడ్డుకు తీసుకువచ్చాడు, జోంగ్ షాంగ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో అమెను పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అమె నదిలో పడటంతో షాక్ లో సృహ కోల్పోయిందని, తరువాత అమె మెల్లిగా కోలుకుంటుందని ఎ్లలిసన్ తెలిపారు.

"సమయానికి రక్షించడంతో ఆ మహిళ వెంటనే కోలుకుని ఊపిరి పీల్చుకుని, స్పృహలోకి వచ్చింది" అని బ్రిటన్ కాన్సులేట్ తన అధికారిక వెబ్ పేజీలో పేర్కొంది. ఈ ఘటన మొత్తాన్ని, మహిళ నీటిలో పడిపోక ముందు నుంచే ఓ యువకుడు వీడియో తీశాడు. చైనా మీడియా సైతం ఇప్పుడు ఎల్లీసన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఎల్లీసన్ బ్రిటన్ మొత్తం గర్వపడేలా వ్యవహరించారని యూకే డిప్లొమాటిక్ మిషన్ వ్యాఖ్యానించింది. ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles