ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవటంతో చదవుకోలేక ఓ విద్యాకుసుమం రాలిపోయింది. తనకు సరస్వతి కటాక్షం వున్నా లక్ష్మీ కటాక్షం లేదని దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని అవేదన చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అలస్యంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణలోని పాలమూరు జిల్లా షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య.. తనకు చదువుకునే మార్గం కానరాక ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని ప్రచార ఆర్భటమే తప్ప.. వాస్తవంలో లేకనే అర్థికంగా అనగారిన ఓ విద్యాసుమం రాలిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. కేవలం డబ్బులేకపోవటంతోనే చదువుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో ఐశ్వర్య కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు షాద్ నగర్ కు వెళ్లారు. ఐశ్వర్య మరణం పట్ట తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన వారు.. బాధిత కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రూ.వెయ్యి కోట్లతో ఏడంతస్తుల మేడలు (సచివాలయం) కట్టే రాష్ట్రంలో... చదువుకు సాయం అందక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. మొదటిది పాలకుడి విలాసం... రెండోది పేదరికపు విలాపం. ఇదీ నేటి తెలంగాణం’ అని రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ అన్ని వర్గాలను అలోచింపజేస్తోంది. కాగా, తన చావుకు ఎవరూ కారణం కాదని, తన వల్ల ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయని తెలుపుతూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తాను చదువు లేకపోతే బతకలేనని పేర్కొంది. స్కాలర్ షిప్ లు ఏడాదికి ఒక్కసారైనా వచ్చేలా చేయాలని ఆమె పేర్కొంది.
ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఐశ్వర్యకు లాక్ డౌన్ తర్వాత హాస్టల్ లో ఉండేందుకు నిరాకరించారు. స్కాలర్ షిప్ కూడా రాకపోవటంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో ఇంటికి వచ్చి కుటుంబానికి భారం కాలేక, అలాగని చదువుకోకుండా ఉండలేక మానసిక వేధనతో ఐశ్వర్య షాద్ నగర్ లో ఉరివేసుకొని మరణించింది. తను ఐఎఎస్ కావాలన్న కల నెరవేరదన్న భయంతో ఆమె ఉరివేసుకుంది. ఈమేరకు సూసైడ్ నోట్ రాసింది. ఐశ్వర్య తండ్రి ఆటో మెకానిక్ కాగా, తల్లి సుమతి టైలర్ గా పనిచేస్తుంది. ఇద్దర్ని చదివించే స్థోమత లేకపోవటంతో ఐశ్వర్య అక్కను తల్లితండ్రులు చదువు మాన్పించారు. ఐశ్వర్య చదువు కోసం ఆయన తండ్రి ఉన్న ఇంటిని కూడా 2లక్షలకు కుదవపెట్టి చదివిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.వెయ్యి కోట్లతో ఏడంతస్థుల మేడలు కట్టే రాష్ట్రంలో... చదువుకు సాయం అందక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. మొదటిది పాలకుడి విలాసం... రెండోది పేదరికపు విలాపం. ఇదీ నేటి తెలంగాణం @manickamtagore @tsnsui @VenkatBalmoor #aishwarya pic.twitter.com/y8ylzeJJxB
— Revanth Reddy (@revanth_anumula) November 9, 2020
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more