Allahabad HC sensational verdict in interfaith marriage మతాంతర వివాహ విషయంలో హైకోర్టు సంచలన తీర్పు

Allahabad high court sensational judgement in interfaith marriage

Allahabad high court, inte-religious marriage, pooja, shavez, love marriage, Shaharanpur, Uttar Pradesh, Crime

Allahabad high court sensational judgement in interfaith marriage. The Apex Court has made it clear that it is the right of a person to chose and stay with them and marry them apart from their caste, region, and religion

‘‘నచ్చిన వ్యక్తితో జీవించే హక్కు’’ వివాహ విషయంలో హైకోర్టు సంచలన తీర్పు

Posted: 11/03/2020 09:08 PM IST
Allahabad high court sensational judgement in interfaith marriage

యువతి, యువకుడు వివాహం చేసుకునే విషయంలో అలహాబాద్ న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పును వెలువరించింది, వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు కూడా వివాహ బంధంతో ఒక్కటి కావచ్చునని తీర్పును వెలువరించింది, తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు వుందని ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది, ఇలా ఒక్కటైన యువతీ, యువకుల జీవితాల్లో కలగజేసుకునే హక్కు మాత్రం ఎవరికీ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది, నచ్చినవారితో జీవించే హక్కు యువతకు వుందని రాష్ట్రోన్నత న్యాయస్థానం పేర్కోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని షహరాన్పూర్ కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్ లకు చెందిన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది, భిన్న మతాలకు చెందిన యువతీ యువకుల వివాహబంధాన్ని ఇరువర్గాలకు చెందిన పెద్దలు అంగీకరించకపోవడంతో.. న్యాయస్తానాన్ని ఆశ్రయించిన వారికి న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. యూపీలోని షహరాన్ పూర్ కు చెందిన పూజా అలియాస్‌ జోయా, షావెజ్‌ పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇష్టంలేని ఇరు కుటుంబసభ్యులు వారి కోసం అన్వేషించారు.

పూజా కుటుంబసభ్యుల అన్వేషణ ఫలించి ప్రేమికుల జాడ కనిపెట్టారు, అయితే వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. తెలిసినవారి ద్వారా బాధితులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మేజర్లమైన తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు. భర్తతోనే కలిఉంటానని ఆమె పేర్కొన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తీర్పు వెలువరించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చు. అయితే వివాహాల కోసం మాత్రమే మతమార్పిడి చేపట్టడం మాత్రం సముచితం కాదని న్యాయస్థానం మరో కేసులో తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles