'BSP will vote for BJP in future UP MLC elections': Mayawati ఎస్పీకి బీఎస్పీ షాక్.. బీజేపికి ఓటువేస్తామన్న అధినేత్రి మాయవతి

Mayawati rues gathbandhan with samajwadi party says bsp will vote for bjp in future up mlc elections

Mayawati, BSP President, Bahujan Samaj Party, Samajwadi Party, SP President, Akhilesh Yadav, Rajya Sabha elections, Uttar Pradesh MLC elections, BJP, BSP, Uttar Pradesh, politics

BSP supremo Mayawati came down heavily on the Samajwadi Party and said that 'We have decided that to defeat SP candidate in future MLC elections in UP, we will put all our force and even if we have to give our vote to BJP candidate or any party candidate, we will do it. Any party candidate, who will be dominant over SP's 2nd candidate, will get all BSP MLAs' votes for sure.'

ఎస్పీకి బీఎస్పీ షాక్.. బీజేపికి ఓటువేస్తామన్న అధినేత్రి మాయవతి

Posted: 10/29/2020 07:09 PM IST
Mayawati rues gathbandhan with samajwadi party says bsp will vote for bjp in future up mlc elections

(Image source from: Twitter.com/ANI)

ఉత్తరప్రదేశ్ లో వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి, తాము నిలబెట్టిన బీఎస్పీ సీనియర్ నేత రామ్‌జీ గౌతమ్‌ కు మద్దతు కూడగట్టుకునే క్రమంలో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో మాయావతి సారథ్యంలోని బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం అమె రెబల్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, వారిలో అస్లం రైనీ, అస్లం చౌదరీ, ముజ్తబా సిద్దీఖీ, హకీం లాల్‌ బింద్‌ లతో పాటు మరో ముగ్గురు వున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందు ఆమె సమాజ్ వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు,   

గత లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీతో కొనసాగుతున్న మహాగట్బందన్ కు కూడా ఆమె వీడ్కోలు పలికారు. గత సార్వత్రిక ఎన్నికల తరువాత తమ పార్టీ నేతలకు ఎస్పీ నేతల నుంచి ఎదురవుతున్న పరాభవాలను కూడా అమె తీవ్రంగా ఖండించారు. ఇక రాజ్యసభ ఎన్నికల వేళ తమ ఎమ్మెల్యేలను ఎస్పీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేయడం కూడా సహేతుకం కాదని అక్షేపించారు. ఈ తరుణంలో రానున్న రాజ్యసభ ఎన్నికలలో తమ పార్టీ ఎస్పీ అభ్యర్థిని ఓడించేందుకు అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు, ఈ క్రమంలో ఓ మెట్టు దిగి బీజేపికి పార్టీకి సైతం మద్దతు ఇవ్వడానికి తాము సిద్దం అని అమె ప్రకటించారు,

బీజేపి కానీ ఏదేని ఎస్పీ పార్టీయేతర పార్టీ రాజ్యసభ ఎన్నికల బరిలో దిగి.. అఖిలేష్ పార్టీని ఓఢించడంలో నడుం బిగిస్తే వారికి తప్పకుండా తమ మద్దతు లభిస్తుందని మాయావతి తెలిపారు. దీంతో పాటు భవిష్యత్తులో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఎస్పీని ఓడించడమే లక్యంగా పెట్టుకుంటామన్నారు. ఎస్పీ తీరును సరిగ్గా అర్థం చేసుకోలేక తాము 1995 జూన్ 2న వారిపై పెట్టిన కేసును ఉపసంహరించు కున్నామని చెప్పారు, ఎస్పీ తీరుపై తాము కాసింత లోతుగా అలోచించాల్సిందని అమె అభిప్రాయపడ్డారు. బిఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రాను కించపరచడం ద్వారా ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ సమాజాన్ని ఎస్పీ అవమానించారని ఆమె నొక్కి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles