Ban all e-gambling apps: AP CM to Centre 132 వెబ్ సైట్లు, యాప్ లను నిషేధించాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ

Ap cm ys jagan writes letter to union minister over ban on online gambling sites and apps

gambling websites, betting wedsites, betting apps, online gambling apps, online gambling, Chief Minister YS Jagan, union minister Ravi shanker prasad, Andhra Pradesh, Politics

Andhra Pradesh Chief Minister YS Jagan writes letter to union minister Ravi shanker prasad over ban on online gambling websites and apps, to which the youth of are the state are falling prey.

132 వెబ్ సైట్లు, యాప్ లను నిషేధించాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ

Posted: 10/29/2020 06:23 PM IST
Ap cm ys jagan writes letter to union minister over ban on online gambling sites and apps

(Image source from: Twitter.com/AndhraPradeshCM)

దేశపౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చెందిన పలు యాప్ లు తస్కరిస్తున్నాయన్న నేపథ్యంలో ఇప్పటికే పలు యాప్ లను కేంద్రప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో దేశప్రజలకు చెందిన డబ్బును కూడా ప్రలోభాలకు గురిచేసి పలు యాప్ లు దోచుకుంటున్నాయని వాటిపై కూడా కేంద్రప్రభుత్వం దృష్టిసారించి నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లు, యాప్ లపై కూడా కేంద్రం కొరడా జుళిపించాలని కోరారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత అన్ లైన్ గ్యాంబ్లింగ్ గేముల మొజులో పడిసర్వం కోల్పుతున్నారని వాటి బారి నుంచి తప్పించుకునే మార్గం కనబడక బలవంతంగా ప్రాణాలను త్యజిస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన యువత గ్యాంబ్లింగ్ ఉచ్చులో చిక్కి.. బానిసలుగా మారుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీటి బారినపడి నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపేందుకు 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు కూడా తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మినిక్లిప్, ఈఏ డాట్ కామ్ సహా మొత్తం 132 వెబ్‌సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగుకు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలని కోరుతూ వాటి వివరాలను ముఖ్యమంత్రి తన లేఖకు జతచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles