Babri Masjid case: LK Advani, MM Joshi and all acquitted బాబ్రి మసీదు కేసులో సీబిఐ కోర్టు సంచలన తీర్పు

All acquitted in babri masjid demolition case advani mm joshi hail verdict

Babri Masjid demolition case verdict, ayodhya verdict, ayodhya, Babri Masjid, Babri Masjid demolition, LK Advani, Uma Bharti, MM Joshi. Kalyan singh, sadhvi pragya, sangh parivar, ram janmabhoomi, kar sevaks, Ram Janmabhoomi, Babri Masjid, Babri Masjid demolition case, CBI court

A special court in Lucknow delivered the much-awaited judgment on Wednesday in the 1992 Babri Masjid demolition case. All the 32 accused, including BJP veterans L.K. Advani and Murli Manohar Joshi, have been acquitted.

బాబ్రి మసీదు కేసు: అద్వానీ, జోషీ సహా నిందితులందరూ నిర్దోషులే: న్యాయస్థానం

Posted: 09/30/2020 07:52 PM IST
All acquitted in babri masjid demolition case advani mm joshi hail verdict

(Image source from: Zeenews.india.com)

దాదాపుగా 28 ఏళ్ల క్రితం నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు ఎలా వుండబోతోందని దేశ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ్ల లక్నోలోని సీబిఐ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరిచింది. దీంతో ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ఎట్టకేలకు తెరపడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కోంటున్న బీజేపి అగ్రనేతలకు ఇవాళ పెద్ద ఊరట లభించింది. ఈ కేసు తీర్పును ఇవాళ వెలువరించిన న్యాయస్థానం నిందులుగా అభియోగాలు ఎదుర్కోంటున్న ఎల్‌.కె.ఆద్వానీ(92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతి, కల్యాణ్ సింగ్ సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది.

బాబ్రి మసీదు కూల్చివేతలో నిందితులందరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. బాబ్రి మసీదు కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్నవారిపై నేరాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. నిందితులపై సరైన ఆధారాలు, రుజువులు లేని కారణంగా వారిపై దాఖలైన అభియోగాలను న్యాయస్థానం కోట్టివేసింది. ఈ మేరకు లక్నోలోని సిబిఐ న్యాయస్థానం జస్టిస్ సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తీర్పును వెల్లడించారు. ఈ కేసు అభియోగాలు ఎదుర్కోంటున్న మొత్తం 49 మందిలో 17 మంది విచారణ కొనసాగుతున్న తరుణంలోనే మరణించారు. కాగా ఈ కేసులో మొత్తంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది.

తీర్పు నేపథ్యంలో నిందితులంతా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఈ నెల 16న న్యాయస్థానం అదేశించినా.. కరోనా కారణంగా బీజేపి అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, హాజరుకాలేదు. ఇక కల్యాణ్‌ సింగ్ లకు కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న కారణంగా వారు కూడా హాజరుకాలేదు. కాగా, సాక్షి మహారాజ్‌, వినయ్ కటియార్‌, ధరమ్‌ దాస్‌, పవన్‌ పాండే, వేదాంతి, లల్లూసింగ్‌, చంపత్‌రాయ్‌లతోపాటు మిగతావారంతా కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ కేసు తీర్పు సందర్భంగా సీబీఐ కోర్టు బయట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్ తో పాటు పలు కీలక ప్రాంతాల్లోనూ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు బీజేపి అగ్రనేత ఎల్‌.కె.ఆద్వానీ పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన తీర్పు అని, నేడు మనందరికీ సంతోషకరమైన రోజుగా పేర్కోన్నారు. రామజన్మభూమి పట్ల తన వ్యక్తిగత, పార్టీ నిబద్ధతను తాజా తీర్పు నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తమను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆడ్వాణీ ఈ విధంగా స్పందించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును మురళీ మనోహర్‌ జోషి స్వాగతించారు. ఆలస్యమైనప్పటికీ కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. దీనిలో చివరకు న్యాయమే గెలిచిందన్నారు. మా ఉద్యమం సామాన్యులతో కూడినదని, దీనిలో ఎలాంటి కుట్ర లేదన్న విషయం తాజా తీర్పు ద్వారా నిరూపితమైందని ఆయన స్పష్టంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles