Vikarabad kidnap: Missing woman found with husband వికారాబాద్ కిడ్నాప్ కేసు సుఖాంతం: భర్తతో కలిసి వెళ్లిన దీపిక

Vikarabad kidnap missing woman found with husband

Deepika, Akhil, Vikarabad kidnap case, New Twist, Family Disputes, Arya samaj, love marriage, police investigation, court, shopping, vikarabad, crime

The kidnap episode of a 26-year-old woman from Vikarabad Town on Sunday evening ended with the police tracing her with her husband Akhil in Siddipet district. 'We have traced Deepika and her husband Akhil in Siddipet. We will produce them before the magistrate,' Vikarabad district Superintendent of Police M Narayana said.

వికారాబాద్ కిడ్నాప్ కేసు సుఖాంతం: భర్తతో కలిసి వెళ్లిన దీపిక

Posted: 09/30/2020 07:36 PM IST
Vikarabad kidnap missing woman found with husband

వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసు సవాల్ గా తీసుకున్న పోలీసులు ఈ కేసులో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించారు. దీపిక తల్లిదండ్రులు తమ బిడ్డకు డ్రామాలాడాల్సిన అవసరం లేదని  చెప్పిన నేపథ్యంలో వారి అంచనాలను తోసిపుచ్చిన దీపిక తన భర్తతో కలిసే వెళ్లిందని పోలీసులు తేల్చారు. భర్తతో కలసి జీవించడానికే ఎక్కువగా మొగ్గుచూపిన దీపిక తన భర్తతో కలసే వుండేందుకు ఇష్టపడి వెళ్లిందని పోలీసులు కనుగోన్నారు. ముందునుంచీ పోలీసులు ఈ మేరకు అనుమానిస్తున్నా దీపిక తల్లిదండ్రులు మాత్రం అందుకు భిన్నమైన కథనాలను వెలిబుచ్చారు.

స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసులో దీపికతో పాటు అమె భర్త అఖిల్ ను సదాశివపేట్ లో ఉండగా పోలీసులు అక్కడి నుంచి వారిని వికారాబాద్ కు తీసుకువచ్చారు. మీడియా ముందు వారిని ప్రవేశపెట్టిన తరువాత వారిని మెజిస్ట్రేట్ ఎదుట కూడా హజరుపర్చారు. దీపిక అచూకీ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏకంగా 48 గంటల తరువాత కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు ఈ జంట పోలీసులకు ఇచ్చిన సమాచారంతోనే వారి ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారని సమాచారం. ఇక ఈ కేసులో తాజాగా పోలీసులు వెలువరించిన వివరాలు ఇలా వున్నాయి.

ఖలీల్ అలియాస్ అఖిల్‌ను ప్రేమించిన దీపిక నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని దీపిక తల్లిదండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి ఆమెతో విడాకులకు దరఖాస్తు చేయించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, ఈ నెల 27న సాయంత్రం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా సమీపంలో దీపిక కిడ్నాప్ అయింది. ఆమె కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తననెవరూ కిడ్నాప్ చేయలేదని, కావాలనే భర్తతో కలిసి కారులో వెళ్లినట్టు దీపిక పేర్కొందని పోలీసులు తెలిపారు. కోర్టులో దీపిక చెప్పే దానిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh