Bypolls to 56 Assembly Seats, 1 LS seat on Nov 3, 7 11 రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..

Bypolls to 56 assembly seats one lok sabha seat on november 3 7

By-elections, Election Commission, Chhattisgarh byelections, Gujarat byelections, Jharkhand byelections, Haryana byelections, Karnataka byelections, Madhya Pradesh byelections, Manipur byelections, Nagaland byelections, Odisha byelections, Telangana byelections, Uttar Pradesh byelections

By-elections to 54 assembly seats across 10 states will be held on November 3, the Election Commission said today. Besides, one Parliamentary constituency in Bihar and two assembly seats from Manipur will to polls on November 7. The counting of votes will be held on November 10.

దుబ్బాక సహా 11 రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..

Posted: 09/29/2020 10:06 PM IST
Bypolls to 56 assembly seats one lok sabha seat on november 3 7

(Image source from: Thehansindia.com)

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 11 రాష్ట్రాలలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైన అభ్యర్థులు ఈ సారి తమకు పోటీదారుడైన రామలింగారెడ్డి లేకపోవడంతో తమ విజయం ఖాయమని ఇప్పటికే జోరుగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సారైనా ఓటరన్న అశీర్వదించకపోతాడా అన్న కోటిఆశలతో బరిలో నిలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తాజాగా, ఈ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. బిహార్ లోని వాల్మీకీ నగర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు దేశంలోని 11 రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 9న దేశంలోని దుబ్బాక సహా 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 17న అభ్యర్థుల నామినేషన్ల స్ర్కృట్నీ జరుగుతుంది. ఇక 18న ఆదివారం కావడంతో ఆ మరుసటి రోజు అంటే అక్టోబరు 19న నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీగా ప్రకటించారు. ఇక ఆ వెంటనే నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి.. నవంబర్ 10 తేదీన కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

దుబ్బాకలో ఈసారైనా పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తుండగా, రామలింగారెడ్డిపై సానుభూతి పవనాలు తమ పార్టీని గట్టెకిస్తాయని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే జోరందుకున్న ప్రచారంతో రాజకీయ పార్టీలు ముందుకు సాగుతుండగా, ఇక షెడ్యూల్ విడుదల కావడంతో వారికి మరింత జోష్ తీసుకువచ్చినట్లు వుంది. ఇక మణిపూర్ లోని రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు బిహార్ లోని పార్లమెంటు స్థానానికి ఈ నెల 13న నోటిపికేషన్ విడుదల కానుండగా, 20న నామినేషన్లకు చివరి తేది, 21న నామినేషన్ల పరిశీలిన, 23న ఉపసంహరణలకు చివరి తేదీ, నవంబర్ 7న పోలింగ్, పదిన కౌంటింగ్ చేపట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles