SC Gives 1 More Week To Submit Loan Moratorium Plan 2, 3 రోజుల్లో మరటోరియంపై వడ్డీ విషయంలో ఫైనల్ డెసిషన్

Loan moratorium plan will be ready by october 1 centre tells supreme court

loan moratorium, banks, Supreme Court, Union Government, coronavirus lockdown, ashok bhushan, payment dues, RBI Guidelines, payment, dues, interest rate, interest waiver, online payment, coronavirus, pandemic, COVID-19, SBI Card, India, Business, Economy

The government informed the Supreme Court that complexities concerning the way forward following the expiry of the loan moratorium are under 'active consideration' at the highest level. The loan moratorium was in place during the pandemic lockdown.

2, 3 రోజుల్లో మరటోరియంపై వడ్డీ విషయంలో ఫైనల్ డెసిషన్

Posted: 09/29/2020 09:42 PM IST
Loan moratorium plan will be ready by october 1 centre tells supreme court

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం కారణంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రుణగ్రహీతలు వాటిని గత ఆరు మాసాలుగా వడ్డీ కట్టలేకపోవడంతో దానికి మారటోరియం తీసుకోవచ్చునని బ్యాంకులు ముందుగానే ప్రకటించాయి. అయితే మారటోరియం సమయంలోనూ చెల్లించని ఈఎంఐలపై వడ్డీ విధింపు విషయం రుణగ్రహీతలను అందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈ విషయంలో కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియంపై వడ్డీ విధించే విషయంలో పలువురు రుణగ్రహితలు బ్యాంకులను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థే మందగమనంలో నడుస్తున్న సమయంలో తాము మారటోరియం పెట్టుకున్నా దానిపై వడ్డీని వసూలు చేయడం సమంజసం కాదని అన్నారు.

ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిర్ణయాన్ని తప్పబట్టింది. ఆర్బీఐపై నెట్టి తప్పించుకోకుండా లాక్ డౌన్ విధించిన కేంద్రమే కాబట్టి మారటోరియంపై కూడా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇశాళ మరో మారు ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుందో వెల్లడించాలని సుప్రీంకోర్టు కోరింది. దీంతో ప్రస్తుతం అదే విషయమై తీవ్రంగా చర్చించిస్తున్నారని మరో రెండు మూడు రోజుల వ్యవదఇలో ఫైనల్ డిసీషన్ తీసుకుంటామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిజేసింది. కేంద్రం నిర్ణయాన్ని తెలియజేస్తే దానిని రికార్డు చేసి పిటీషనర్లకు అఫిడెవిట్ పంపించాలని న్యాయస్తానం సూచించింది.

వడ్డీ చెల్లింపుల అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలియజేశారు. అలాగే మారటోరియంపై వడ్డీలు విధించే అంశం కూడా కేంద్రం సమీక్షిస్తోందని తెలిపారు. దీనిపై అధిక ప్రాధ్యానతను ఇచ్చిన కేంద్రం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని.. ప్రస్తుతం ఈ నిర్ణయం ఖారారు చివరి దశకు చేరకుందని కూడా తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ వివరాలతో పాటు అఫిడవిట్‌ సమర్పిస్తారని తెలిపారు. అక్టోబరు 1 కల్లా అఫిడవిట్ ను ఇ-మెయిల్‌ ద్వారా పంపిస్తారని చెప్పారు. దీనిపై తదుపరి విచారణ అక్టోబరు 5న జరుగుతుంద’ని జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, ఎం.ఆర్‌.షా సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles