Three Maoists killed in encounter in Telangana ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Three maoists killed in encounter in telangana s bhadradri district

Three Maoists killed, encounter, Telangana, Bhadradri district, Chennapuram, Cherla block, Maoists, maoists death, kothagudem encounter, bhadradri kothagudem encounter, bhadradri encounter

Three Maoists, including two women, were killed in an exchange of fire with police forces in Telangana’s Bhadradri Kothagudem district. District superintendent of police Sunil Dutt said the encounter took place in the forests of Chennapuram of Cherla block at around 7 pm, when the security forces were engaged in combing operations

చెన్నాపురం అడవిలో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోయిస్టుల మృతి

Posted: 09/24/2020 03:34 AM IST
Three maoists killed in encounter in telangana s bhadradri district

తెలంగాణ పోలీసులు అందివచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులపై వేటను కోనసాగిస్తున్నారు. ఈ నెల 13న దాదాపు 300 మంది మావోయిస్టుల కదలికలు సుకుమా జిల్లా కిష్టారం వద్ద సీఆర్పీఎఫ్ డ్రోన్ కెమెరాలకు చిక్కాయి. స్థానికంగా ఉన్న ఓ వాగును దాటుతుండగా కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి. సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసేందుకే భారీ స్థాయిలో మావో దళాలు అక్కడికి తరలి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఛత్తీస్ గఢ్ పోలీసుశాఖ సమాచారం అందించిన పోలీసులు.. ఇటు తెలంగాణలో ఎక్కడా మావోయిస్టులు అలజడి రేగినా మొత్తంగా తూర్పారబడుతున్నారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా రెండు పర్యాయాలు మావోలతో ఎన్ కౌంటర్ జరిగినా.. వారు తప్పించుకుని పారిపోవడంతో అటవీప్రాంతం చుట్టూ పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా ఇవాళ కూడా రెండు పర్యాయాలు మావోలతో ఎదురుకాల్పలు జరిగాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసు బలగాలకు ఈ రోజు రెండు చోట్లా ఎదురు కాల్పులు జరిగాయి. కాగా ఈ రెండు ఘటనలలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మండలంలో ఒక పర్యాయం, ఇక సాయంత్రం ఏడు గంటల సమయంలో చర్ల మండలం చెన్నపురం వద్ద రెండో పర్యాయం మావోలతో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో పాటు మొత్తంగా ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారని పోలీసువర్గాలు పేర్కోన్నాయి, ఘటనా స్థలం నుంచి 8 ఎంఎం రైఫైల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అయితే ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాల్వంచ మండలంలో కాల్పులు జరిగాయని మావోలు పారిపోయారని పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ కు సమీపంలోనే జరిగిందని పేర్కోన్నారు. ఈ ఘటనలో ఒక ఎస్బిబిఎల్ గన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా సాయంత్రం ఏడు గంటలకు చర్ల మండలం చిన్నాపురం వద్ద మావోలు ఎదురుపడ్డారని, తమ బలగాలను చూసి తప్పించుకునే క్రమంలో ఎదురుకాల్పులకు పాల్పడ్డారని పోలీసులు బలగాలు పేర్కోన్నాయి, అయితే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలతో పాటు ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలపారు, కాగా, పలువురు మావోలు మాత్రం ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారని వారి కోసం గాలింపు కొనసాగుతొందని పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles